
గ్రీన్ క్యాప్సికమ్ విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కేలరీలలో చాలా తక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ కూరగాయ యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

గ్రీన్ క్యాప్సికమ్ తినటం వల్ల రక్తహీనతను తగ్గించడంలో సహాయపడతాయి. శీరీరానికి కావాల్సిన ఇనుము, విటమిన్లకు మంచి వనరు. వీటిని తీసుకోవడం వల్ల ఇనుము లోపాన్ని అధిగమించవచ్చు. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు వీటిని తినటం మంచిది. దీంతో మీరు సులభంగా బరువు తగ్గవచ్చు. త్వరగా బరువు తగ్గడానికి సహాయపడే అనేక పోషకాలను కలిగి ఉంటాయి.

గ్రీన్‌క్యాప్సికమ్‌లో లుటీన్, జియాక్సంతిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కళ్ళకు ప్రయోజనకరం. పచ్చి క్యాప్సికమ్ తినడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. దీనిలోని పోషకాలు హానికరమైన UV కిరణాలు, స్క్రీన్‌ల నుండి వచ్చే నీలి కాంతి నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి.

అంతేకాదు.. ఇది చర్మానికి కూడా మంచిది. ఇందులో క్యాప్సైసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది చర్మాన్ని అనేక సమస్యల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. తరచూ తినడం వల్ల ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవచ్చు. దీనిలో విటమిన్లు E, C ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. ఇందులో విటమిన్ B6, జుట్టు కుదుళ్లను బలోపేతం చేసే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

గ్రీన్ క్యాప్సికమ్‌లోని ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడాని, వాపును తగ్గించడానికి సహాయపడతాయి. ఇలా క్యాప్సికంను రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. దీన్ని ఉడకబెట్టి లేదా నేరుగా సలాడ్ రూపంలోనూ తినవచ్చు.