ఎముకలకు పుష్టి.. నొప్పులు మాయం.. పాతకాలం నాటి ఆరోగ్యమైన లడ్డు

Updated on: Oct 03, 2026 | 5:53 PM

ప్రసవం తర్వాత స్త్రీలలో శారీరక సత్తువ తగ్గి తీవ్రమైన నీరసం, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు రావడం సహజం. అలాగే వయసు పైబడిన వారిలోనూ మోకాళ్లు, ఎముకల బలహీనత రోజువారీ పనులను కష్టతరం చేస్తుంటుంది. ఇలాంటి సమయాల్లో శరీరానికి ఉక్కు బలాన్నిచ్చేందుకు మన పూర్వీకులు ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉండే తుమ్మ జిగురుతో 'గోంద్ లడ్డు' చేసి ఇచ్చేవారు. 

1 / 5
కావలసిన పదార్థాలు: 50 గ్రాములు గోంద్ (తుమ్మ జిగురు), అర కప్పు చిన్న ముక్కలుగా తరిగిన బాదం పప్పులు, అర కప్పు ముక్కలుగా తరిగిన జీడిపప్పు, పావు కప్పు పిస్తా, 2 కప్పుల ముక్కలుగా తరిగిన ఎండు కొబ్బరి,  అర కప్పు కిస్‌మిస్, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, అర కప్పు గుమ్మడి గింజలు , అర కప్పు సన్‌ఫ్లవర్ గింజలు, 1 కప్పు అవిసె గింజలు, 
అర కప్పు తెల్ల నువ్వులు, 2 నుండి 3 టీస్పూన్ల పసుపు, 1 టేబుల్ స్పూన్ శొంఠి పొడి, 1 టీస్పూన్ యాలకుల పొడి, 2 కప్పుల బెల్లం తురుము ,  పావు కప్పు స్వచ్ఛమైన ఆవు నెయ్యి

కావలసిన పదార్థాలు: 50 గ్రాములు గోంద్ (తుమ్మ జిగురు), అర కప్పు చిన్న ముక్కలుగా తరిగిన బాదం పప్పులు, అర కప్పు ముక్కలుగా తరిగిన జీడిపప్పు, పావు కప్పు పిస్తా, 2 కప్పుల ముక్కలుగా తరిగిన ఎండు కొబ్బరి,  అర కప్పు కిస్‌మిస్, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, అర కప్పు గుమ్మడి గింజలు , అర కప్పు సన్‌ఫ్లవర్ గింజలు, 1 కప్పు అవిసె గింజలు,  అర కప్పు తెల్ల నువ్వులు, 2 నుండి 3 టీస్పూన్ల పసుపు, 1 టేబుల్ స్పూన్ శొంఠి పొడి, 1 టీస్పూన్ యాలకుల పొడి, 2 కప్పుల బెల్లం తురుము ,  పావు కప్పు స్వచ్ఛమైన ఆవు నెయ్యి

2 / 5
తయారీ విధానం: కడాయిలో 2-3 చెంచాల నెయ్యి వేడిచేసి 50 గ్రాముల గోంద్‌ను మీడియం మంటపై వేయించాలి. గోంద్ పాప్‌కార్న్‌లా, అప్పడాల్లా ఉబ్బి క్రిస్పీగా వేగాక గిన్నెలోకి తీసుకోవాలి. అదే నేతిలో తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా వేసి 2 నిమిషాలు వేయించి.. చివర్లో కిస్‌మిస్, గసగసాలు వేసి వేయించి పక్కన ఉంచాలి. ఆ తర్వాత తరిగిన ఎండు కొబ్బరి ముక్కలను కూడా దోరగా వేయించి వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి.

3 / 5
అదే కడాయిలో గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ గింజలు, అవిసె గింజలు వేసి అవిసె గింజలు చిటపటలాడే వరకు డ్రై రోస్ట్ చేయాలి. నువ్వులను కూడా వేయించి ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఆ వేడి కడాయిలోనే 2-3 చెంచాల పసుపు వేసి కలిపితే పచ్చివాసన పోతుంది చల్లారిన ఎండు కొబ్బరిని మిక్సీలో మెత్తటి పొడిలా చేసి బౌల్‌లోకి తీసుకోవాలి.

4 / 5
ఆ తర్వాత వేయించిన గింజల మిశ్రమం (సీడ్స్), వేయించిన గోంద్‌లను విడివిడిగా మిక్సీలో వేసి లైట్‌గా బరకగా గ్రైండ్ చేసి అదే బౌల్‌లో కలపాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న బాదం-జీడిపప్పులు, యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ శొంఠి పొడి మరియు వేడి చేసిన పసుపు వేసి మొత్తం పొడులను బాగా కలపాలి. వేరొక కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 కప్పుల మెత్తటి బెల్లం తురుము వేసి మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచాలి.

5 / 5
పాకం పట్టకుండా బెల్లం కరిగి ఇప్పుడే మరుగు ప్రారంభమవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి ఎక్కువ మరిగితే లడ్డు గట్టిపడుతుంది. ఈ వేడి బెల్లం సిరప్‌ను లడ్డు పొడి మిశ్రమంలో పోసి ముందుగా గరిటెతో, కాస్త గోరువెచ్చగా అయ్యాక చేత్తో బాగా ఒత్తుతూ కలపాలి. కొద్దికొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ గుండ్రటి లడ్డూల్లా చుట్టుకోవాలి. డెలివరీ అయిన బాలింతలు జీర్ణశక్తిని బట్టి 6 నుండి 8 వారాల తర్వాత రోజుకో లడ్డు తిని గ్లాసు పాలు తాగితే నొప్పులు తగ్గి త్వరగా కోలుకుంటారు. మోకాళ్ల నొప్పులు ఉన్న పెద్దవారు కూడా రోజూ ఒకటి తింటే ఎంతో హాయిగా, బలంగా ఉంటుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us