
కొనుగోలుదారులకు బంగారం ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. గత కొన్ని రోజులుగా బ్రేకుల్లేని బండిలా పరుగులు పెడుతున్న ఈ ఆభరణాల ధరలు మంగళవారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఉదయం 6 గంటలతో పోల్చుకుంటే 10 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 160 తగ్గింది. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,49,020గా ఉండగా, ఉదయం 6 గంటలకు ఈ ధర రూ. 1,49,170గా ఉంది. అలాగే ఉదయం 6 గంటలకు రూ. 1,36,740గా ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 1,36,600 వద్ద ట్రేడవుతోంది. ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 2,45,000 వద్ద ట్రేడవుతోంది. విశాఖ, విజయవాడల్లో సైతం ఇదే తరహా ధరలు కొనసాగుతున్నాయి.

ఇక దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, పుణెల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,49,020గా ఉండగా, ఉదయం 6 గంటలకు ఈ ధర రూ. 1,49,170గా ఉంది. అలాగే ఉదయం 6 గంటలకు రూ. 1,36,740గా ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 1,36,600 వద్ద ట్రేడవుతోంది.

చెన్నైలో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,49,170గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 1,36,750 వద్ద ట్రేడవుతోంది. ఇక అక్కడ తులం బంగారం ధర రూ. 1,49,020గా నడుస్తుండగా, వెండి ధర మాత్రం రూ. 2,35,000 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ మారకం విలువ కారణంగా బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటాయి. అలాగే ప్రాంతాలను బట్టి కూడా ధరల్లో మార్పు ఉంటుంది. కాబట్టి మీరు బంగారం కొనాలనుకుంటే, కచ్చితంగా మీ సమీపంలోని షోరూమ్‌కు వెళ్లి ప్రస్తుత ధరలు తెలుసుకోండి. అలాగే బంగారం కొనే ముందు దానిపై హాల్‌మార్క్‌ను కచ్చితంగా చెక్ చేయండి.