Gold and Silver Price: పసిడి, వెండి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. నాలుగు గంటల్లోనే రూ.20వేలు తగ్గిన ధర

Updated on: Mar 03, 2026 | 10:40 AM

Gold and Silver Price: బంగారం కొనేవారికి ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే మంగళవారం వరుసగా రెండో సారి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇరాన్-ఇజ్రాయెల్ వార్‌ ఎఫెక్ట్‌తో గత రెండు మూడు రోజులులగా భారీగా పెరిగిన తర్వాత ఇవాళ కాస్త దిగొచ్చి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి.

1 / 5
గోల్డ్, సిల్వర్ ప్రియులకు ఇదో సూపర్ గుడ్‌న్యూస్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గత మూడు నాలుగు రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు సడెన్‌గా మంగళవారం రెండోసారి తగ్గుముఖం పట్టాయి. కాబట్టి తాజా హెచ్చుతగ్గుల తర్వాత బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

2 / 5
తాజా హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,70,020 వద్ద ఉండగా ఉదయం ఈ ధర రూ.1,70,500గా ఉంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర ఇప్పుడు రూ.1,55,850గా ఉండగా.. ఉదయం 6గంటలకు ఈ ధర రూ.1,56,290 వద్ద స్థిరపడింది.

3 / 5
ఇక హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,70,020 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,55,850 గా ఉంది.

4 / 5
ఇక దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, కేరళ పూణెలో సైతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,020 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,55,290గా ఉంది. ఇక ఢిల్లీలో మాత్రం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం రూ.1,70,170గా ఉండగా చెన్నైలో తులం బంగారం ధర రూ.1,70,730 వద్ద కొనసాగుతుంది.

5 / 5
ఇక సిల్వర్ ధర విషయానికి వస్తే కొన్ని గంటల్లోనే వెండి ధర భారీగా దిగొచ్చింది. 4 గంటల్లోనే కేజీ వెండిపై ఏకంగా రూ. 20వేల వరకు తగ్గింది. తగ్గిన ధరల తర్వాత ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2.95,000 వద్ద కొనసాగుతుంది. కానీ హైదరాబాద్‌లో మాత్రం కేజీ వెండి రూ.3,15,000గా ఉంది. ఇక విజయవాడ, విశాఖలోనూ ఇవే రేట్లు ఉన్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us