భూమి వేడెక్కుతున్నా కొన్ని నగరాలు ఎందుకు చల్లబడుతున్నాయి?

Updated on: Nov 14, 2026 | 11:43 AM

మనం రోజూ వింటున్న మాట ఏంటంటే భూమి వేడెక్కుతోంది. అయితే చాలా మంది అన్ని చోట్లా భూమి వెడెక్కుతుంది అనుకుంటారు. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే? భూమి అంతటా కాకుండా కొన్ని నగరాల్లో భూమి విపరీతంగా వేడెక్కుతున్నా.. కొన్ని ప్రాంతంలో మాత్రం చలి పెరుగుతుందంట. మరి ఇలా ఎలా జరుగుతుంది అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. కానీ దీనికి అసలైన కారణం వాతావరణం. ఇది అన్ని చోట్లా ఒకే విధంగా ఉండదు. ఎండ, మేఘాలు, గాలి, తేమ ఇవన్నీ ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. అందుకే కొన్ని చోట్ల విపరీతమైన వేడి, కొన్ని చోట్ల విపరీతమైన చలి ఉంటుందంట.

1 / 5
ఇక ఈ విషయం గురించి శాస్త్రవేత్తలు  అధ్యాయనం చేయగా..  దాని ద్వారా చాలా విషయాలను తెలియజేయడం జరిగింది.  2026 మే నెలలో కమ్యూనికేషన్స్ ఎర్త్  అండ్ ఎన్విరాన్‌మెంట్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం , 2002, 2021 మధ్య ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,400 నగరాల నుండి సేకరించిన  శాటిలైట్ డేటాను పరిశీలించారు. అందులో ఎక్కువ నగరాల్లో వేడి పెరిగినా,  కొన్ని నగరాలలో దాదాపు పగటి పూట భూ ఉపరితల ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గినట్లు వారు గుర్తించారు.

2 / 5
ఈ అధ్యయనం ప్రకారం, దాదాపు 86 శాతం నగరాల్లో పగటి పూట వేడి పెరిగితే, 96 శాతం నగరాల్లో రాత్రి పూట వేడి పెరిగింది. పగటి పూట  చల్లబడిన నగరాలు కేవలం 3.9 శాతం మాత్రమే. రాత్రి పూట  చల్లబడటం అనేది దాదాపు లేనట్లే ఉంది. అంటే చల్లబడటం అనేది చాలా తక్కువ, ఎక్కువగా పగలు మాత్రమే వేడి ఎక్కువగా పెరిగినట్లు తేలింది.

3 / 5
 ఈ వ్యత్యాసం 2026 జనవరిలో చాలా స్పష్టంగా కనిపించింది. ప్రపంచ సగటు ఉపరితల గాలి ఉష్ణోగ్రత 12.95 డిగ్రీల సెల్సియస్ గా, 1991-2020 సగటు కంటే 0.51 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. అయినా ఉత్తరార్ధ గోళంలోని పెద్ద భాగంలో తీవ్ర చలి వచ్చింది. ఫిన్లాండ్ లోని లప్పీన్ రంటాలో -31.5 డిగ్రీలు, సైబీరియాలో దాదాపు -40 డిగ్రీలు నమోదయ్యాయి.

4 / 5
ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈశాన్య చైనా వంటి ప్రాంతాల్లోని నగరాల్లో మాత్రమే కాకుండా  భారత దేశంలో కూడా  పగటి ఉష్ణోగ్రత పెరుగుదల తక్కువగా ఉండటం లేదా కొన్నిచోట్ల తగ్గడం కనిపించిందని వారు తెలియజేయడం జరిగింది. దీనికి పెరుగుతున్న ఏరోసాల్ సాంద్రత, వృక్ష సంపదలో మార్పులు కారణం కావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏరోసాల్స్ అనేవి గాలిలో తేలియాడే చిన్న కణాలు. ఇవి దుమ్ము, అగ్నిపర్వతాల నుంచి సహజంగానూ, పరిశ్రమలు, వాహనాలు, బయోమాస్ దహనం నుంచి మానవ కార్యకలాపాల వల్లనూ వస్తాయి.

5 / 5
చూడటానికి చల్లగా ఉంటే మంచిదే అనిపించవచ్చు. కానీ ఇది అసలు మంచిది కాదు. ఎందుకంటే ఏరోసాల్స్ లో ఉండే సూక్ష్మ కణాలు మన ఆరోగ్యానికి చాలా హానికరం. ఇవి మేఘాలు, వర్షాలను కూడా మార్చేస్తాయి. ఇక చెట్ల విషయానికి వస్తే, చెట్లు నీడనివ్వడమే కాకుండా, నీటిని ఆవిరిగా వదులుతాయి. దాని వల్ల చుట్టూ ఉన్న గాలి చల్లబడుతుంది. అలాగే అమెరికాలోని NOAA సంస్థ కూడా ఆగ్నేయ ప్రాంతంలో వేడి, చలి మారుతూ ఉండటానికి ఆ ప్రాంతం ఉన్న ప్రదేశం, సముద్రానికి దగ్గరగా ఉండటం కారణం అని చెప్పింది.

Loading...
Unable to load recommendations.
Follow Us