ప్రమాదం కంటే ముందే.. సిలిండర్ గ్యాస్ లీక్ ఎలా గుర్తించాలో తెలుసా?

Updated on: Oct 21, 2026 | 7:19 PM

వంట గదిలో ఉండే వాటిలో గ్యాస్ స్టవ్ అనేది తప్పనిసరి. అయితే చాలా మంది గ్యాస్ సిలిండర్ అంటే భయం ఉంటుంది. అది ఏ సమయంలో పేలుతుందో అని భయపడి పోతుంటారు. అయితే గ్యాస్ సిలిండర్ వలన ప్రమాదం జరగక ముందే దాని లీకేజ్ ఎక్కడుందో సులభంగా గుర్తించవచ్చునంట. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
గ్యాస్ లీక్ అయ్యి ప్రమాదం జరిగి చాలా చోట్ల కొందరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అందుకే ఈ గ్యాస్ సిలిండర్ విషయంలో చాలా మంది జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే మీరు ప్రమాదం జరగక ముందే గ్యాస్ లీకేజ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా. అయితే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇంతకీ అవి ఏవి అంటే.

2 / 5
డిటర్జెంట్ పౌడర్ నీటిలో కలిపి నురగ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. నురగ ఎక్కువగా వచ్చిన తర్వాత దానిని మీ రెగ్యులేటర్ , పై కనెక్షన్‌లకు పూయాలి. అప్పుడ బుడగలు ఎక్కడ ఏర్పడితే, అక్క గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తించ వచ్చును. దీని వలన మీరు ముందగానే గ్యాస్ సిలిండర్ ప్రమాదం నుంచి బయటపడవచ్చును. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌కు కలిపే ఇథైల్ మెర్కాటప్టాన్ అనే రసాయనం ఘాటైన వాసన ద్వారా కూడా గ్యాస్ లీకేజ్ ఎక్కడ ఉందో సులభంగా గుర్తించవచ్చునంట.

3 / 5
అయితే చాలా మంది తెలిసి తెలియక ఈ లీకేజీలు గుర్తించే సమయంలో చిన్న చిన్న పొరపాటు చేస్తుంటారు. లీకేజీ గుర్తించిన వెంటనే అగ్గి పుల్ల లేదా లైటర్ ఉపయోగించి ఆ ప్రదేశంలో అంటించడం వంటి పనులు చేయకూడదు. దీని వలన పెద్ద ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. అంతే కాకుండా ఇంటి నుంచి బయటకు గాలి ప్రసరణ జరిగేలా చూడాలి. ప్రమాదం గుర్తించిన వెంటనే దానిని మెల్లిగా ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసి తీసి వేయాలి.

4 / 5
తలుపులు కిటికీలు ఏవైనా మూసి ఉంటే ముందుగా వాటిని ఓపెన్ చేయాలి.  అలాగే, నిప్పురవ్వలు ఏర్పడకుండా ఉండేందుకు ఫ్యాన్లు లేదా విద్యుత్ ఉపకరణాల స్విచ్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయవద్దు. మీరు  లీకేజీ గుర్తించిన వెంటనే, సిలిండర్ రెగ్యులేటర్ మూసి వేయాలి. తర్వాత దానిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లి, గ్యాస్ ఏజెన్సీ లేదా సమీపంలోని అత్యవసర సహాయ కేంద్రానికి ఈ విషయాన్ని తెలియజేయాలి.

5 / 5
ఇలా చేయడం వలన మీరు ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి, కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడగలరు. అంతే కాకుండా ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడగలరు. అయితే ముఖ్యంగా లీకేజీ గుర్తించిన తర్వాత మాత్రం తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

Loading...
Unable to load recommendations.
Follow Us