Ganga Dussehra 2026: ఈ నెలలోనే పవిత్ర గంగా దసరా.. ఇలా చేశారంటే జీవితంలో సక్సెస్, సుఖ, సంతోషాలు మీ సొంతం!

Updated on: May 23, 2026 | 6:02 PM

భారతదేశం విశ్వాసాల గడ్డ, ఇక్కడి నదులను తల్లులుగా పూజిస్తారు. వీటిలో గంగామాత అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ సంప్రదాయంలో గంగా నదిని కేవలం ఒక నదిలా కాకుండా సాక్షాత్తు దైవస్వరూపంగా భావిస్తారు. భగీరథుని కఠోర తపస్సుకు మెచ్చి గంగాదేవి భూలోకానికి దిగివచ్చిన పవిత్రమైన రోజునే గంగా దసరా (Ganga Dussehra) గా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం శుక్ల పక్షం దశమి తిథి నాడు ఈ పండుగ వస్తుంది. ఈ సమయంలో, గంగానది ఘాట్‌లు చూడముచ్చటగా ఉంటాయి. కాశీ నుండి హరిద్వార్ వరకు ఉన్న ఘాట్‌లు ఎంత అద్భుతంగా, కాంతివంతంగా ఉంటాయంటే, నిజంగా స్వర్గం భూమిపైకి దిగివచ్చినట్లుగా అనిపిస్తుంది.

1 / 6
గంగా దసరా పర్వదినాన వారణాసిలోని గంగా నది ఘాట్లు దీపాలు, పూల అలంకరణలు, వేద మంత్రోచ్ఛారణలతో అత్యంత దైవీక వాతావరణాన్ని సంతరించుకుంటాయి. ఈ ఏడాది ఉదయ తిథి ఆధారంగా గంగా దసరా పండుగను 2026, మే 25 సోమవారం నాడు జరుపుకుంటారు. తెల్లవారుజామున 04:30 గంటలకు దశమి తిథి ప్రారంభం అవుతుంది. ఆ మార్నాడు ఉదయం 05:10 గంటలకు దశమి తిథి ముగుస్తుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

2 / 6
గంగా దరసరా సమయంలో బ్రహ్మ ముహూర్తం ఉదయం 04:30 గంటల నుంచి 05:30 గంటల వరకు ఉంటుంది. అమృత ఘడియలు ఉదయం 05:25 గంటల నుంచి ఉదయం 07:08 గంటల వరకు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. శుభ సమయం ఉదయం 08:51 గంటల నుంచి ఉదయం 10:34 గంటల వరకు ఉంటుంది.

3 / 6
గంగా దసరా పూజా విధానం (Puja Vidhi)లో అత్యంత ముఖ్యమైనది పవిత్ర స్నానం. గంగా దసరా రోజున గంగా నదిలో లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం అత్యంత శ్రేష్ఠం. నదులకు వెళ్లే అవకాశం లేనివారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకుని, గంగాదేవిని స్మరిస్తూ స్నానం చేయవచ్చు.

4 / 6
సూర్యోదయ సమయంలో నదిలోనే నిలబడి సూర్యభగవానుడికి, గంగామాతకు అర్ఘ్యం (నీటిని సమర్పించడం) ఇవ్వాలి. స్నానానంతరం గంగాదేవి విగ్రహానికి లేదా చిత్రపటానికి పువ్వులు, అక్షతలు, సింధూరం, నైవేద్యం సమర్పించాలి. పిండితో చేసిన ప్రమిదలో నెయ్యి వేసి దీపారాధన చేసి, వీలైతే నదిలో దీపాన్ని వదలాలి (దీపదానం). పూజ సమయంలో గంగా చాలీసా లేదా గంగా స్తోత్రం పఠించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు.

5 / 6
గంగా దసరా రోజున దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఈ పవిత్రమైన రోజున నీరు, ఆహారం, పండ్లు, వస్త్రాలు, పూజా సామాగ్రిని దానం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీ శక్తి, సామర్థ్యాల మేరకు నెయ్యి, ఉప్పు, నూనె, చక్కెర, బంగారం వంటి వస్తువులను దానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మీకు ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.

6 / 6
గంగా దసరా పండుగ సందర్భంగా గంగా ఘాట్‌లన్నీ పువ్వులు, రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు. సాయంత్రం, హారతి ఇచ్చి భక్తులు నీటిలో దీపాలు సమర్పించే సమయంలో, ఈ ఘాట్ అందం వర్ణనాతీతంగా ఉంటుంది. సంధ్యా సమయం కాగానే, వేలాది మంది భక్తులు ఆకులపై చిన్న దీపాలను, పువ్వులను ఉంచి వాటిని నదీ ప్రవాహాలలోకి వదులుతారు. ఈ ఆచారాన్ని దీపదానం అంటారు. ఆ దృశ్యం మనోహరంగా ఉంటుంది. చీకటిలో తేలియాడుతున్న ఆ లెక్కలేనన్ని దీపాలు, ఆకాశంలోని నక్షత్రాలన్నీ గంగామాత ఒడిలో పడి నీటిలో మినుకుమినుకుమంటున్నట్లుగా కనిపిస్తాయి.

Follow Us