
వర్షాకాలం సమయంలో శీతాకాలం సమయంలో చాలా వరకు కప్పలు ఇంటి వద్ద తిరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు అనుకోకుండా కప్పలు ఇంటిలోకి ప్రవేశిస్తాయి. మరి ఇలా ఇంటిలోకి కప్పలు రావడం మంచిదేనా? దీని గురించి వాస్తు పండితులు ఏం చెబుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇంటిలోకి కప్పలు రావడం దేనిని సూచిస్తుందో తెలుసుకుందాం.

గరుడ పురాణం, స్కంద పురాణాలలో ఇంటిలోకి కప్ప రావడం గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే వాస్తు ప్రకారం ఇంటిలోకి కప్ప రావడం చాలా మంచిదంట. ఇది సానుకూల శక్తిని సూచిస్తుందని చెబుతున్నారు పండితులు. ఇది శక్తికి సంకేతం. ఇంటిలోకి కప్ప రావడం చాలా మంచిదంట. ఇలా ఇంటిలోకి కప్ప రావడం చాలా వరకు అన్ని విధాలుగా కలిసి వస్తుందంట.

ఇంటిలోకి కప్ప రావడం అనేది జీవితంలోని సానుకూల మార్పులకు సంకేతం. అంతే కాకుండా ఇది ఆధ్యాత్మిక పురోగతికి సూచనగా భావిస్తారంట. అలాగే ఎవరి ఇంటికి ప్రధాన ద్వారంలో కప్ప కనిపిస్తే అది లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. ఇది అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయాన్ని పెంచుతుంది. ప్రతి పనిలో కలిసి వస్తుంది.

ఇంటిలో కప్ప కనిపించడం, ముఖ్యంగా వంట గదిలో కప్ప కనిపించడం అనేది ధనం ధాన్యానికి లోటు ఉండదు అనే అర్థం కిందకు వస్తుందంట. అందువలన ఎవ్వరు అయినా సరే ఇంటిలోకి కప్ప వస్తే ఆందోళన పడాల్సిన పని లేదు. ఇది ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు.

ముఖ్య గమనిక : పై సమాచారం శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. ఇది కేవలం ఇంటర్నెట్ ,పండితుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.