
పచ్చి కొబ్బరి అటుకుల పాయసం.. మీ ఇంట్లో ఒకసారి చేసి తింటే మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉంటారు. అయితే, ఈ రెసిపీని ఎక్కువగా పండుగల సమయంలో చేస్తారు. మరి, ఆలస్యం చేయకుండా ఆంధ్రా స్టైల్లో దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

పచ్చి కొబ్బరి అటుకుల పాయసం రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు అటుకులు, ఒక పచ్చి కొబ్బరి తురుము, అర లీటర్ పాలు, పావుకిలో బెల్లం , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 8 జీడిపప్పు, 10 కిస్మిస్ లు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, రెండు గ్లాస్ ల నీరు తీసుకోవాలి. మీరు ఈ స్వీట్ ను కరెక్ట్ గా చేస్తే మంచిగా వస్తుంది టేస్ట్.

పచ్చి కొబ్బరి అటుకుల పాయసం ఎలా తయారు చేయాలంటే? అటుకులను ఇలా రెడీ చేసుకోవాలి: ముందుగా ఒక కప్పు అటుకులను బాగా కడిగి 10 నిమిషాల పాటు వీటిని బాగా నానబెట్టాలి. ఆ తర్వాత వీటి నుంచి నీటిని పూర్తిగా వంపి పక్కన పెట్టుకోవాలి. ఆ తరవాత దీనిలో కొబ్బరిని రెడీ చేసుకోవాలి ముందుగానే తురిమి పెట్టుకోవాలి

కొబ్బరి మిశ్రమం : పచ్చి కొబ్బరి తురుమును తీసుకుని, రోటిలో కానీ మిక్సీలో కానీ దీనిని వేసి, ఒక గ్లాస్ నీళ్లు కూడా పోసి వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అయితే, దీనిలో మీరు కొబ్బరి పాలు తీసుకోవచ్చు. అలాగే, తురుమును వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఏది ఈజీగా అనిపిస్తే దానిని తీసుకుని పక్కన పెట్టుకోండి.

గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి దానిలో పోసి వాటిని బాగా మరిగించాలి. ఇవి బాగా కాగిన తర్వాత అటుకులు వేసి మీడియం మంటపై ఉంచాలి. ఇప్పుడు బెల్లం కరిగించి ఈ పాకాన్ని పాలలో కలుపుకుని అటుకులు మెత్తగా అయినా తరవాత కొబ్బరి తురుము వేసుకుని 10 నిముషాలు ఉంచి కిందకు దించేయడమే.