
మద్యపానం: పొగ త్రాగడం, మందు తాగడం వంటి రెండు చెడు అలవాట్లు మనిషి లివర్ ను దెబ్బ తినేలా చేస్తాయి. కాబట్టి, వీటిని ఎక్కువగా అలవాటు చేసుకోకండి. సాధ్యమైనంత వరకు వీటిని దూరం పెట్టడం మంచిది.

చక్కెరలు ఉన్న ఆహారాలు: సోడాలు, ఎనర్జీ డ్రింక్స్ మీ కాలేయాన్ని ఎంతగా దెబ్బ తీస్తాయో తెలుసా? మీరు తీసుకునే ఈ డ్రింక్స్ , ఫుడ్స్ కొవ్వుగా మార్చి మీ లివర్ ను దెబ్బతీస్తాయి.

హై సోడియం ఫుడ్స్ : డబ్బాల్లో నిల్వ ఉంచిన సూప్‌లు, ప్యాక్ చేసిన ఫుడ్స్ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వలన కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, వీటిని తినకపోవడమే మంచిది.

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం సమస్య మీరు ఏ నూనెను ఉపయోగిస్తున్నారనేది మాత్రమే కాదు. నూనెను ఎలా ఉపయోగిస్తున్నారనేది కూడా చాలా ముఖ్యం. అనేక శుద్ధి చేసిన కూరగాయల నూనెలు, అధిక ఉష్ణోగ్రతల వద్ద పదే పదే వేడి చేసినప్పుడు వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇది ఆల్డిహైడ్‌లతో సహా అనేక హానికరమైన సమ్మేళనాలను విడుదల చేస్తుంది. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. దీర్ఘకాలంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

ప్రాసెస్ చేసిన ఫుడ్స్: ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోకండి. ఎందుకంటే, వీటి వలన లివర్ దెబ్బతినే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. కూల్ డ్రింక్స్, సాల్ట్ బిస్కెట్లు, ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకోవద్దు.