పైసా ఖర్చు లేకుండా.. చిన్న కొమ్మలు నాటితే పెరిగే పూల మొక్కలు ఇవే

Updated on: Sep 10, 2026 | 4:03 PM

ఇంటి బాల్కనీలోనో లేదా పెరట్లోనే పచ్చని మొక్కలను పెంచాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే నచ్చిన ప్రతి మొక్క కోసం నర్సరీలకు వెళ్లి కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. కానీ ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే.. చాలా రకాల అలంకార మరియు పూల మొక్కలు కేవలం ఒక చిన్న కొమ్మను మట్టిలో నాటితే చాలు ఎలాంటి ప్రత్యేక శ్రమ లేకుండా బతికేస్తాయి. స్నేహితులు, బంధువుల ఇళ్లలో లేదా పరిసరాల్లో కనిపించినప్పుడు చిన్న కొమ్మను తెచ్చుకుని మన కుండీలలో నాటుకుంటే సరిపోతుంది. జీరో బడ్జెట్‌తో ఇంట్లోనే గార్డెన్‌ను పచ్చగా మార్చుకోగల ముఖ్యమైన మొక్కల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 9
 బ్రహ్మకమలం (Brahma Kamalam):రాత్రివేళ వికసించే పరమ పవిత్రమైన పువ్వు బ్రహ్మకమలం. దీనిని పెంచడానికి నర్సరీలో ఖరీదైన మొక్క కొనాల్సిన పనిలేదు. పెద్ద చెట్టు నుండి ఒక ఆకు లేదా కొమ్మ భాగాన్ని కత్తిరించి మట్టిలో గుచ్చితే చాలు.. కొద్ది రోజుల్లోనే ఆ కణుపుల నుంచి సరికొత్త చిగుళ్లు, పిలకలు వచ్చి కొత్త మొక్కగా ఎదుగుతుంది.

2 / 9
గులాబీ (Rose): పూల రాణిగా పిలువబడే గులాబీ మొక్కను పెన్సిల్ మందమున్న కొమ్మ నాటితే చాలు చక్కగా మొక్కను పెంచవచ్చు.  వర్షాకాలం లేదా చలికాలం ప్రారంభంలో నాటితే 3 నుండి 4 వారాల్లో సరికొత్త చిగుళ్లు, వేర్లు వస్తాయి. నాటు గులాబీలు కొమ్మల ద్వారా చాలా వేగంగా వేర్లు పెరుగుతాయి. 

3 / 9
మల్లె (Jasmine): భారతీయ సంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగిన మల్లె పువ్వు మంచి సువాసనతో పరిసరాలను ఆహ్లాదపరుస్తుంది. వర్షాకాలంలో కొద్దిగా ముదిరిన ఆకుపచ్చ-గోధుమ రంగు కాండాన్ని 5 నుండి 6 అంగుళాల పొడవున కత్తిరించి నాటడం ద్వారా కొత్త మొక్కను పెంచవచ్చు. 

4 / 9
మందార (Hibiscus): తోటలో ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా కనిపించే మందార మొక్క కొమ్మ కట్ చేసి నాటడం ద్వారా వంద శాతం సులువుగా ఎదుగుతుంది. ఒక మోస్తరు ముదిరిన కొమ్మను ఎంచుకుని, ఆకులను కత్తిరించి, కాండం దిగువ భాగాన్ని కొద్దిగా గీకి మట్టిలో గుచ్చాలి. వర్షాకాలంలో లేదా వసంత ఋతువులో నాటినప్పుడు కొమ్మలు ఎండిపోకుండా వేగంగా వేర్లు పుట్టుకొస్తాయి. 

5 / 9
నందివర్ధనం (Crape Jasmine ): నిత్యం పచ్చదనంతో నిండి ఉండి, తెల్లటి పాల వంటి పూలను పూసే అందమైన మొక్క నందివర్ధనం.  కొమ్మలను 6 అంగుళాల పొడవున కత్తిరించి, వర్షాకాలంలో లేదా తేమ ఎక్కువగా ఉండే సమయంలో నాటితే చాలా వేగంగా వేర్లు పాతుకుంటాయి. కొమ్మ చివర పాలను తుడిచివేసి నేలలో గుచ్చడం ఉత్తమం. 

6 / 9
కాగితాల పూలు (Bougainvillea): కాగితాల పూలు అతి తక్కువ నీరు, గరిష్ట ఎండను కోరుకునే అత్యంత అందమైన తీగ పొద పూల మొక్క. బాగా ముదిరిన గట్టి కొమ్మలను 8 అంగుళాల పొడవున కత్తిరించి,  రంధ్రాలున్న కుండీలో ఇసుక శాతం ఎక్కువగా ఉన్న మట్టిలో నాటాలి. కొమ్మలపై నేరుగా ఎండ పడకుండా కొద్ది రోజులు పాక్షిక నీడలో ఉంచితే కొత్త మొగ్గలు చిగురిస్తాయి. 

7 / 9
పోర్టులాకా (Portulaca): ఇది సక్యులెంట్ జాతికి చెందినది కావడంతో దీని ప్రతి చిన్న కొమ్మలోనూ నీటి నిల్వలు ఉంటాయి. కేవలం 2 నుండి 3 అంగుళాల కొమ్మను తుంపి సాధారణ నేల లేదా కుండీ మట్టిపై ఉంచి కొద్దిగా నొక్కినా చాలు 4-5 రోజుల్లోనే వేర్లు వచ్చి వ్యాపిస్తుంది. ఉదయం 9 గంటల ఎండ తాకగానే ఎరుపు, పసుపు, తెలుపు, నారింజ, మెజెంటా రంగుల్లో నక్షత్రాల్లాంటి పూలు వేల సంఖ్యలో వికసిస్తాయి. 

8 / 9
అల్లామండ (Allamanda): అల్లామండ మొక్క కొమ్మ కట్ చేసి  నాటడం ద్వారా సులువుగా పెరుగుతుంది. దీని ముదిరిన ఆకుపచ్చ కొమ్మను 6 అంగుళాల పొడవున కత్తిరించి, ఆకులను కత్తిరించి తేమతో కూడిన కంపోస్ట్ మట్టిలో నాటాలి. వర్షాకాలంలో నాటితే వేర్లు అత్యంత వేగంగా వస్తాయి. 

9 / 9
పెంటాస్ (Pentas): సీతాకోకచిలుకలను, తేనెటీగలను విపరీతంగా ఆకర్షించే మొక్క పెంటాస్. దీని లేత కాండం చివరలను  4 అంగుళాల మేర కత్తిరించి, దిగువ భాగాన్ని తేమ నేలలో లేదా కోకోపీట్ కలిపిన కుండీలలో నాటాలి. దాదాపు రెండు వారాల్లోనే ఇవి తేలికగా వేర్లు తొడుగుతాయి. ఎరుపు, ఊదా, పింక్, తెలుపు రంగుల పూల గుత్తులతో ఏడాది పొడవునా పూస్తూనే ఉంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us