
ప్రస్తుతం నకిలీ పేమెంట్ యాప్‌ల మోసాలు ఎక్కువవుతున్నాయి. మీరు ఈ మోసాల ఉచ్చులో పడకుండా ఉండాలంటే, కొనుగోలుదారుడి మొబైల్ స్క్రీన్‌ను మాత్రమే కాకుండా మీ బ్యాంక్ ఖాతా మర్చంట్ యాప్ నోటిఫికేషన్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఆ తరువాత మాత్రమే దీనిని నమ్మాలి.

కొందరు నకిలీ యాప్స్ ను ఉపయోగించి, ఫోన్ పే, గూగుల్ పే లాంటి ఒరిజినల్ యాప్ లాగే నకిలీ సక్సెస్‌ఫుల్ పేమెంట్ స్క్రీన్ షాట్లను చూపిస్తూ ఎంతో మంది చిన్న చిన్న వ్యాపారులను మోసం చేస్తున్నారు. కాబట్టి, మీరు కూడా జాగ్రత్త పడాలి. ఈ ట్రిక్స్ ను ఫాలో అయితే ఎలాంటి డిజిటల్ మోసాల బారిన పడకుండా ఉంటారు.

బ్యాంక్ బ్యాలెన్స్ ను చెక్ చేయండి: ఎవరైనా డబ్బులు వేశామని చూపించే స్క్రీన్ షాట్‌ను అస్సలు నమ్మొద్దు. మీ ఫోన్ లోని PhonePe Business ఇంకా సంబంధిత మర్చంట్ యాప్ పేమెంట్ హిస్టరీని చూడండి. ఇంకా మీ ఖాతాలోకి డబ్బులు జమ అయ్యాయో? లేదో మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుని మీరు ఏవైనా వస్తువులు ఇవ్వండి.

SMS నోటిఫికేషన్లు గమనించండి: పేమెంట్ నిజంగా జరిగినప్పుడు మీ బ్యాంక్ ఇంకా మీ యూపీఐ యాప్ నుంచి కొద్దీ నిముషాల్లోనే అఫీషియల్ ఎస్ఎంఎస్ (SMS) వస్తుంది ఇలా వస్తే మీ దానిలో పేమెంట్ పడినట్టు అర్థం. ఒకవేళ యాప్ నోటిఫికేషన్ రాకపోతే డబ్బులు పడలేదని అర్థం చేసుకోండి.

వాయిస్ నోటిఫికేషన్ స్మార్ట్ స్పీకర్ వాడండి: దుకాణదారులు ఫోన్ పే స్పీకర్స్ ను పక్కా పెట్టుకోవాలి. ఇంకా స్మార్ట్ వంటి వాయిస్ అలర్ట్ డివైజ్‌లను ఏర్పాటు చేసుకోవడం మంచిది. డబ్బులు పేమెంట్ అవ్వగానే స్పీకర్ తో వాయిస్ కన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మోసపోయే అవకాశం అసలు ఉండదు.