
ఆరోగ్యంగా ఉండాలంటే గుడ్లను తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అసలు వీటిని తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

అయితే, ఉదయం రెండు నుంచి మూడు గుడ్లు మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియ పని తీరును కూడా మెరుగుపరుస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉడికించిన గుడ్లు మంచివి.

మెదడు ఆరోగ్యం: వీటిని మనం ఫుడ్ డైట్ లో చేర్చుకోవడంలో వలన మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

ఎముకల బలం: గుడ్లలో విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఎముకలను బలంగా ఉంచుతాయి.

నాన్ వెజ్ లో గుడ్లు తినడం చాలా మంచిది. ఎందుకంటే, దీనిలో మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు చాలానే ఉంటాయి. అలాగే, వీటిని తింటే కడుపు నిండిన అనుభూతి ఉంటుంది.