చేప తల తింటే ఆరోగ్యానికి లాభమా? నిపుణులు ఏం చెబుతున్నారంటే!

Updated on: Oct 06, 2026 | 3:50 PM

ప్రపంచవ్యాప్తంగా సీఫుడ్‌‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చేపల పులుసు, చేపల వేపుడు అంటే ఇష్టపడని వారు ఉండరు. గోదావరి జిల్లాల్లో లభించే పులస చేప మొదలుకొని సాధారణ చేపల వరకు ప్రతీ ఒక్కటీ పోషకాల గని అని చెప్పవచ్చు. చాలామంది చేపల కూర తినేటప్పుడు ముక్కలను ఇష్టంగా తింటారు కానీ, చేప తలకాయను పక్కన పడేస్తుంటారు. అయితే, చేప తలలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయని మీకు తెలుసా?

1 / 5
చేపల్లో ఎన్నో విలువైన పోషకాలు ఉంటాయని, వీటిని తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతారు. అయితే చేప ముక్కలతో పాటు చేప తలకాయ తినడం వల్ల కూడా అనేక అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని తెలిస్తే ఎగిరి గంతేస్తారు. చేప తలలో విటమిన్ ఎ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.

2 / 5
చేప తలలో ఉండే ముఖ్యమైన పోషకాలు: చేప తలకాయ భాగంలో విటమిన్ ఎ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను మానవ శరీరం సొంతంగా తయారు చేసుకోలేదు. కాబట్టి వీటిని ఆహారం ద్వారానే పొందాల్సి ఉంటుంది. చేప తలకాయ తినడం ద్వారా ఈ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

3 / 5
చేప తలలోని పోషకాలు మెదడు పనితీరును వేగవంతం చేస్తాయి. పిల్లలు, వృద్ధులు దీనిని తీసుకోవడం వల్ల మతిమరుపు సమస్యలు దూరమై జ్ఞాపకశక్తి పెరుగుతుంది. విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల రేచీకటి, కంటి చూపు మందగించడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

4 / 5
సమృద్ధిగా లభించే ఖనిజాలు: చేపలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బాడీకి కావలసిన ఐరన్, జింక్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, ఐయోడిన్ వంటి ఖనిజాలు అందుతాయి. ఇవి శరీరంలోని లవణాల స్థాయిలను సమతుల్యంగా ఉంచి కండరాల తిమ్మిరిని తగ్గిస్తాయి. అంతేకాకుండా ఎముకల బలానికి అవసరమయ్యే విటమిన్ డి, చర్మం, రక్తకణాల ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్ బి2 కూడా లభిస్తాయి.

5 / 5
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడేవారికి చేప తల ఓ మంచి ఔషధంలా పనిచేస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. అందుకే ఎలాంటి అనుమానం లేకుండా చేప తలకాయని కూడా రుచికరంగా వండుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us