రోజుకో అరటిపండు తినటం మామూలు విషయంకాదు.. మీ ఆరోగ్యానికి తిరుగులేని ఔషధం!

Updated on: Sep 28, 2026 | 8:50 AM

అన్ని కాలాల్లోనూ, అతి తక్కువ ధరకు అందుబాటులో ఉండే పండ్లలో అరటిపండు ఒకటి. చాలామంది దీనిని సాధారణ పండుగానే భావిస్తారు. కానీ, రోజుకో అరటిపండు తినడం వల్ల మన శరీరంలో ఎన్నో సానుకూల మార్పులు జరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో పొటాషియం, ఫైబర్, విటమిన్ బి6, విటమిన్ సి, అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒక అరటిపండు తినడం వల్ల లభించే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1 / 5
 గుండె ఆరోగ్యానికి కొండంత అండ- అరటిపండులో పొటాషియం అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది శరీరంలో సోడియం ప్రభావాన్ని తగ్గించి, అధిక రక్తపోటును (BP) అదుపులో ఉంచుతుంది. ఫలితంగా గుండె సంబంధిత జబ్బులు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

2 / 5
జీర్ణవ్యవస్థ క్రమబద్ధీకరణ- అరటిపండులో ఫైబర్, పెక్టిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ప్రేగుల ఆరోగ్యకరమైన కదలికలకు తోడ్పడతాయి. మలబద్ధకంతో బాధపడేవారు రోజూ ఒక అరటిపండు తింటే ఆ సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

3 / 5
తక్షణ సహజ శక్తి- అరటిపండులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. వ్యాయామం చేయడానికి ముందు లేదా అలసటగా ఉన్నప్పుడు అరటిపండు తింటే శరీరానికి తక్షణమే ఎనర్జీ లభిస్తుంది. క్రీడాకారులు దీనిని తమ ఆహారంలో ఎక్కువగా తీసుకోవడానికి ఇదే కారణం. దీనిలోని విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి శరీర కణాలను రక్షిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.

4 / 5
 మెదడు చురుకుదనం, మానసిక ప్రశాంతత- అరటిపండులో ఉండే విటమిన్ B6 మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది.

5 / 5
 రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ- అరటిపండ్లలో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఇది ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందించే అరటిపండును ప్రతిరోజూ మీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పరిపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందోచ్చు!

Loading...
Unable to load recommendations.
Follow Us