
పుట్టగొడుగులపై ఇటీవల జరిపిన అధ్యయనంలో రోజుకు ఐదు బటన్ మాష్రూమ్స్ (చిన్న పుట్టగొడుగుల)ను తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, చిత్తవైకల్యంతో పోరాడటానికి సహాయపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. పుట్టగొడుగులలో యాంటీఆక్సిడెంట్లు ఎర్గోట్, గ్లూటాథియోన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి.

పెన్ స్టేట్ సెంటర్ ఫర్ ప్లాంట్ అండ్ మష్రూమ్ ప్రొడక్ట్స్ ఫర్ హెల్త్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాబర్ట్ బీల్మాన్ ప్రకారం.. పుట్టగొడుగులలో రెండు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని పరిశోధనలో తేలిందని, అవి ఎర్గోథియోనిన్, గ్లూటాథియోన్. ఇవి వృద్ధాప్యం, ఇతర వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పుట్టగొడుగులలోని పోషకాలు శరీరాన్ని రక్షిస్తాయి. 1,400 రకాల పుట్టగొడుగులు ఉన్నాయి. అయితే అన్నీ తినదగినవి కావు.

బటన్ పుట్టగొడుగులను తినడానికి ఉత్తమమైనవిగా భావిస్తారు . అవి ప్రతిచోటా సులభంగా లభిస్తాయి. పుట్టగొడుగులలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వాటిలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తమ ఆహారంలో చేర్చుకోవాలని సలహా ఇస్తారు.

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ఉడికించినప్పుడు కూడా, పుట్టగొడుగులు వాటి ప్రోటీన్ కంటెంట్‌ను నిలుపుకుంటాయి. బటన్ పుట్టగొడుగులు విటమిన్ బి-కాంప్లెక్స్, విటమిన్ డి, పొటాషియం వంటి పోషకాలకు మంచి మూలం. బటన్ పుట్టగొడుగులలో ఉండే ప్రోటీన్ శరీర కండరాలను బలోపేతం చేయడం ద్వారా రోజువారి శక్తిని నిర్వహించడంలో సహాయపడుతుంది.

ఇది తక్కువ కేలరీల ఆహారం, ఇది బరువును నియంత్రిచండలో, ఫిట్‌గా ఉంచడంలో సహయపడుతుంది. అలాగే రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. బటన్ మష్రూమ్స్‌ని తరచూ తినటం వల్ల ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం అందిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే పేగు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.