స్పైసీ మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్దకూడా మిగలదు అంతే

Updated on: Oct 03, 2026 | 12:38 PM

మటన్ కర్రీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటూ ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. ఇక సండే వస్తే ప్రతి ఇంటిలో మటన్ అనేది తప్పకుండా ఉంటుంది. అయితే ఎప్పుడూ వండే విధంగా కాకుండా, ఇప్పుడు మనం కాస్త కొత్తగా స్పైసీ స్పైసీ మటన్ కర్రీ ఇంటిలోనే చాలా సులభంగా ఎలా వండాలో చూసేద్దాం.

1 / 5
మటన్ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు :  మటన్: అర కేజీ,  ఉల్లిపాయలు,  టమాటా,   నూనె,  ఉప్పు,  పసుపు,   కారం, నీళ్లు,   కొత్తిమీర ద్దిగా మసాలా పేస్ట్ కోసం:   లవంగాలు: 4,   యాలకులు2,   దాల్చిన చెక్క 2 అంగుళాలు,  కాశ్మీరి ఎండుమిరపకాయలు 3-4 ఎండుమిరపకాయలు,   వెల్లుల్లి రెమ్మలు,  అల్లం,   మిరియాలు,   ధనియాలు,   జీలక,   కరివేపాకు,   గసగసాలు 1 టీస్పూన్.

2 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా మటన్ తీసుకోవాలి. శుభ్రంగా కడిగి నిమ్మరసం, పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇదే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీని కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో రెండు టీ స్పూన్‌ల నూనె వేసి, అది వేడి అయిన తర్వాత. అందులో  లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కాశ్మీరి ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి.

3 / 5
 వెల్లుల్లి, అల్లం ముక్కలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, నాలుగు రెమ్మల కరివేపాకు వేసి సగం వరకు వేయించాలి. ఇవి వేగిన తర్వాత టీస్పూన్ గసగసాలు వేసి తక్కువ మంటపై దోరగా వేయించుకోవాలి. గసగసాలు త్వరగా వేగుతాయి కాబట్టి చివరిలో వేయాలి. మాడిపోకుండా జాగ్రత్తపడాలి. అన్ని పదార్థాలు చక్కగా వేగిన తర్వాత, వాటిని మిక్సీ జార్‌లో తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వల్లనే కూర రుచి అద్భుతంగా ఉంటుంది.

4 / 5
ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో మూడు టేబుల్‌స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాస్త కాగిన తర్వాత, చిన్న ముక్కలుగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేసి మీడియం మంటపై లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత, తరిగిన ఒక టమాటా ముక్కలు, మసాలా  పేస్ట్ వేసి, మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, నూనె మసాలా నుండి విడిపోయేంతవరకు నిరంతరంగా కలుపుతూ బాగా వేయించాలి.

5 / 5
 మసాలా చక్కగా వేగిన తర్వాత, ముందుగా శుభ్రం చేసుకున్న మటన్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మటన్ ఈ మసాలాలో బాగా వేగాలి. సుమారు ఏడు నుండి ఎనిమిది నిమిషాలు మీడియం మంటపై వేయించాలి. ఇలా చేయడం వల్ల మటన్ ముక్కలకు మసాలా బాగా పట్టి రుచి మెరుగుపడుతుంది.ఇప్పుడు అర టీస్పూన్ పసుపు, మూడు టీస్పూన్ల కారం వేసి మసాలా అంతా మటన్ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి.  తర్వతా మటన్ మొత్తం ఉడికంచుకోవాలి. అందులోచివరగా కొత్తిమీర, పూదీనా చల్లుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us