
తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా సోయా చంక్స్ తీసుకోవాలి. వీటిని ఒక పాత్రలోకి తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో ఒక కప్పు మిల్ మేకర్స్‌కి రెండు కప్పుల నీరు తీసుకొని అందులో ఉప్పు వేసి బాగా వేడి చేయాలి. తర్వాత అందులో వీటిని వేసి ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కాస్త చల్లారనివ్వాలి. తర్వాత సోయాలోని నీరు పోయాలే పిండి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు నీళ్లు పూర్తిగా పోయిన తర్వాత సోయా చంక్స్ తీసుకొని దానిలో రుచికి సరిపడ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ సాస్, సోయా సాస్ , మైదా పిండి, వట్ టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ పిండి వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి.

అందులో సరిపడ నూనె వేసి, నూనె బాగా వేడి అయిన తర్వాత అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న సోయా చంక్స్‌ను ఒక్కొక్కటిగా విడివిడిగా వేసి ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల అవి ఒకదానికొకటి అతుక్కోకుండా, క్రిస్పీగా అవుతాయి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, మధ్య మధ్యలో తిప్పుతూ బంగారు రంగు వచ్చేవరకు ఫ్రై చేయండి తర్వాత పాన్‌లోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన సోయా చంక్స్‌ను చిల్లీ సాస్ లేదా టమాటా సాస్‌తో నేరుగా స్నాక్‌గా తినవచ్చు.

ఇప్పుడు మంచూరియా సాస్ తయారు చేసుకోవాలి, దీని కోసం మళ్లీ స్టవ్ ఆన్ చేసి, పాన్‌లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేయండి. సన్నగా కట్ చేసిన ఒక టీస్పూన్ అల్లం ముక్కలు, ఒక టీస్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. రెండు పచ్చిమిర్చి చీలికలు, సన్నగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ వేసి దోరగా వేయించాలి. అర టీస్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఒక టీస్పూన్ షెజ్వాన్ సాస్, రెండు టేబుల్ స్పూన్ల టమాటా సాస్, ఒక టీస్పూన్ సోయా సాస్, ఒక టీస్పూన్ వెనిగర్ వేసి లో ఫ్లేమ్‌లో బాగా కలపాలి.

ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టీస్పూన్ కార్న్ ఫ్లోర్ పిండిని తీసుకుని, పావు కప్పు నుండి అర కప్పు వరకు నీళ్లు కలిపి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో సాస్‌తో కలిపి, లో ఫ్లేమ్‌లో రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. ఇది చిక్కగా మారుతుంది. ఈ సమయంలో ఫ్రై చేసిన సోయా చంక్స్‌ను వేసి, కొత్తిమీర, ఉల్లికాడలు వేయాలి. అంతే సోయా మంచూరియా రెడీ.