
బోటీ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా నాన్ వెజ్ తింటారు. మరీ ముఖ్యంగా సండే వస్తే చాలు మటన్, బోటీ, చికెన్ కర్రీలను చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇప్పుడు మనం చాలా టేస్టీగా మసాలా ఘాటు లేకుండా బోటీ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం.

బోటి ఫ్రై తయారీకి ముందుగా ఒక కిలో పావు బోటిని తీసుకోవాలి. దీనిని కనీసం పదిసార్లు నీట్ గా కడిగి శుభ్రం చేసుకోవాలి. బోటి శుభ్రంగా లేకపోతే రుచి ఉండదు. శుభ్రం చేసుకున్న బోటిని ఒక కుక్కర్లో వేసి, తగినన్ని నీళ్లు పోసి, రెండు టేబుల్ స్పూన్ల పసుపు, ఉప్పు కలిపి పది విజిల్స్ వచ్చేవరకు ఉడకబెట్టాలి.

మెత్తగా ఉడికిన బోటిని మళ్లీ ఒకసారి శుభ్రంగా కడిగి, సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆ్ చేయాలి, తర్వాత దాని పాన్ పెట్టి, అందులో నూనె వేయాలి. ఆయిల్ వేడయ్యాక, పచ్చిమిర్చి వేసి వేగించాలి. ఆ తర్వాత మూడు ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసి, అవి లేత ఎరుపు రంగులోకి మారేవరకు వేగించాలి.

ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత, శుభ్రం చేసి సన్నగా తరిగిన బోటిని అందులో వేసి కలపాలి. బోటి మగ్గుతున్న సమయంలో ఒక చిన్న దాల్చిన చెక్క, మూడు నాలుగు యాలకులు, కొన్ని లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసి బాగా కలపాలి. ఇవి బోటికి మంచి సువాసనను ఇస్తాయి. బోటి నూనెలో బాగా మగ్గుతున్నప్పుడు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపాలి. ఇందులోనే కొద్దిగా కసూరి మేతి వేయాలి, కానీ ఎక్కువ వేయకూడదు, చేదు రావచ్చు.

తరువాత, కారం ,ఉప్పు, ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. మసాలా వాడాల్సిన అవసరం లేదు. పోపులో బిర్యానీ ఆకు వేసాం కాబట్టి రుచి అద్భుతంగా ఉంటుంది. బోటీ మంచిగా ఉడికి, వేయించాలి. తింటే పాపడాల్లా ఉండాలి. అంతే కరకరలాడే తెలంగాణ బోటి ఫ్రై సిద్ధం. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి అంతే బోటీ ఫ్రై రెడీ.