
వరంగల్ కోట, రామప్ప : అలాగే పిల్లలకు కాకతీయుల అద్భుతమైన కట్టడాలను చూపెట్టాలి అనుకున్నా, ఆ ప్రదేశాలను మీరు కూడా చుట్టిరావాలి అనుకుంటే తప్పకుండా వరంగల్ వెళ్లాల్సిందే. ఇక్కడ చూడాల్సిన అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. పాకాల సరస్సు, వరంగల్ కోటా, భద్రకాళి టెంపుల్, లక్నవరం చెరువు, బొగత జలపాతం అన్నీ కూడా సులభంగా చుట్టేయవచ్చును.

అనంతగిరి హిల్స్ : వికారాబాద్ జిల్లాలో ఉన్న అనంతగిరి హిల్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. అందమైన కొండలు, చుట్టూ చెట్లు, తోటలు, జలపాతాల మధ్య ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే మీరు అనంతగిరి హిల్స్‌కు వెళ్లాల్సిందే. ప్రకృతి ప్రేమికులందరినీ ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది.

లక్నవరం సరస్సు : తెలంగాణలో ములుగు జిల్లాలో ఉన్న లక్నవరం సరస్సు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందమైన అడవి మధ్యలో ఉన్న ఈ సరస్సు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

కుంటాల జలపాతం : తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలలో కుంటాల జలపాతం ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. దసరా సెలవుల్లో వాటర్ పాల్స్ వద్ద ఆనందంగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ జలపాతాన్ని సందర్శించాల్సిందే.

గోల్కొండ కోట, చార్మినార్ : చాలా మందికి హైదరాబాద్‌ను విజిట్ చేసి చార్మినార్, గోల్కొండ కోట చూడాలి అనుకుంటారు. అయితే మీకు హైదరాబాద్ వచ్చి తెలంగాణ చరిత్రకు సంబంధించిన ప్రసిద్ధ కట్టడాలను చూడాలి అనుకుంటున్నారా? అయితే దసరా సెలవులకు హైదరాబాద్ వచ్చేయండి.