ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగే ముందు ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే ఏం జరుగుతుందంటే..?

Updated on: Apr 06, 2026 | 7:24 AM

ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేటి రోజుల్లో చాలా మంది ఉదయాన్నే నిద్రలేవగానే లీటర్ల కొద్దీ నీరు తాగడాన్ని ఒక నియమంగా పెట్టుకున్నారు. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం మంచిదే అయినప్పటికీ, అది సరైన పద్ధతిలో, సరైన మోతాదులో లేకపోతే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఉదయాన్నే నీళ్లు ఎలా తాగాలి? అతిగా తాగితే వచ్చే ఇబ్బందులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
వ్యక్తి వయస్సు, బరువు, శారీరక శ్రమ, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలపై నీటి అవసరం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, వేసవి కాలంలో ఎక్కువగా చెమట పడటంతో శరీరం నుంచి నీరు కోల్పోతుంది. అందువల్ల ఆ సమయంలో ఎక్కువ నీరు తాగడం అవసరం.

2 / 5
ముఖ్యంగా కిడ్నీ లేదా గుండె జబ్బులు ఉన్నవారు నీరు ఎక్కువగా తాగితే ఆ అవయవాలపై భారం పడే అవకాశం ఉంటుంది, కాబట్టి వారు వైద్యుల సూచనలు పాటించాలి. దాహం వేసే వరకు ఆగకుండా, రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉండటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

3 / 5
పురుషులు రోజుకు సుమారు 3 నుంచి 3.7 లీటర్లు, మహిళలు 2 నుంచి 2.7 లీటర్ల వరకు నీరు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇది కేవలం సాధారణ మార్గదర్శకం మాత్రమే. వ్యాయామం చేసే వారు లేదా బహిరంగ పనులు చేసే వారు మరింత నీరు తీసుకోవాలి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు సాధారణం కంటే ఎక్కువ నీరు అవసరం. రోజుకు 10 నుండి 12 గ్లాసుల నీరు తాగడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలకు 6 నుండి 8 కప్పుల నీరు వారి ఎదుగుదల, హైడ్రేషన్ కోసం అవసరం.

4 / 5
నీరు ఎలా తాగాలి?:అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా నీటి విషయంలోనూ పరిమితి అవసరమని ఆయుర్వేదం సూచిస్తోంది. నిద్రలేవగానే లీటర్ల కొద్దీ నీటిని బలవంతంగా తాగొద్దు. మీ శరీర తత్వానికి అనుగుణంగా, మీకు దాహం వేసినంత వరకు మాత్రమే గోరువెచ్చని నీటిని తాగండి. నీటిని ఎల్లప్పుడూ కూర్చుని, నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. నిలబడి తాగడం వల్ల అది నేరుగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

5 / 5
రుతువులను బట్టి మార్పులు: చలికాలంలో రోజంతా గోరువెచ్చని నీరు తాగడం మంచిది. వేసవిలో గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని ఎక్కువగా తీసుకోవచ్చు. కానీ ఫ్రిజ్ నీటిని ఖాళీ కడుపుతో తీసుకోకపోవడమే శ్రేయస్కరం. రాగి లేదా వెండి పాత్రల్లో నీటిని నిల్వ చేసి తాగడం మంచిదే, కానీ అది కూడా మితంగా ఉండాలి. ఉదయాన్నే ఒకేసారి 2 లీటర్ల నీటిని తాగే ప్రయత్నం మానుకుని, రోజంతా కొద్దికొద్దిగా నీటి వినియోగాన్ని పెంచుకోవడం ఉత్తమం.

Follow Us