
రోగనిరోధక శక్తి పెంపు: లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పాలతో కలిసి తీసుకున్నప్పుడు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. చలికాలంలో వ్యాపించే రకరకాల ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

జలుబు, గొంతు నొప్పి నుండి ఉపశమనం: లవంగాలలో ఉండే యూజినాల్ అనే కాంపౌండ్ యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలను కలిగి ఉంటుంది. గొంతు నొప్పి, పొడి దగ్గు, నాసికా రంధ్రాల మూసుకుపోవడం వంటి సమస్యలతో బాధపడేవారు లవంగాల పాలు తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: రాత్రి వేళ లవంగాల పాలు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను సమర్థవంతంగా నివారిస్తుంది. ఆహారం త్వరగా అరగడానికి సహాయపడుతుంది.

ఎముకలు, పళ్ల ఆరోగ్యానికి మేలు: పాలలో క్యాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉంటాయి. లవంగాలలో ఉండే మాంగనీస్ ఎముకల సాంద్రతను పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండింటి కలయిక వల్ల పళ్లు, ఎముకలు దృఢంగా మారతాయి మరియు కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన నిద్ర: లవంగాల పాలు తాగడం వల్ల నరాల ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. రాత్రి పూట నిద్రలేమితో బాధపడేవారు వేడివేడి లవంగాల పాలు తాగితే హాయిగా నిద్ర పడుతుంది. దీనికోసం ఒక గ్లాసు పాలలో 2 నుంచి 3 లవంగాల పొడి లేదా లవంగాలను వేసి 5 నిమిషాల పాటు బాగా మసలబెట్టాలి. అందులో రుచి కోసం కొద్దిగా పటికబెల్లం లేదా తేనె కలుపుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు దీనిని తీసుకోవడం వల్ల శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు.