అరెరే విరిగిన కుర్చీలు కొత్తగా మార్చడం ఇంత ఈజీనా.. ఈ చిన్న ట్రిక్‌ ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం!

Updated on: Nov 10, 2026 | 6:19 PM

ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ కుర్చీలు, బకెట్‌లు వాడుతూ ఉంటారు. అయితే ఎప్పుడైనా అవి పొరపాటున విరిగిపోతే అవి ఏం పనికిరావని, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని పడేసి కొత్తవి కొంటుంటారు. కానీ మీకు కొన్ని చిన్న చిట్కాలు తెలిస్తే విరిగిన వాటినే మళ్లీ అతికింటి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి విరిగిన ప్లాస్టిక్ కుర్చీలను ఎలా అతికించాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1 / 5
యూట్యూబ్‌లో @SandeepVartikaVloge అనే ఛానెల్‌లో షేర్ చేసిన వీడియోలో చెప్పిన ప్రకారం..  విరిగిన ప్లాస్టిక్ కుర్చీని సులభంగా అతికించవచ్చు. ఇందుకోసం కుర్చీ విరిగిన భాగాన్ని ముందుగా శుభ్రం చేసి, ఆ తర్వాత బలమైన గ్లూ సాయంతో రెండు భాగాలను సరైన స్థానంలో అతికించాలి. గ్లూ అంటించిన తర్వాత కొంతసేపు ఆరనివ్వాలి, ఇలా చేస్తే అది బాగా పట్టు సాధిస్తుంది.

2 / 5
ఇప్పుడు ఓ పాత ఎలక్ట్రిక్ వైర్ లోపల ఉండే రాగి తీగను బయటకు తీసి ఉంచుకోవాలి.. ఇప్పుడు కుర్చీ విరిగిన భాగానికి ఇరువైపులా సమాన దూరంలో చిన్న చిన్న రంధ్రాలు చేయాలి. ఇందుకోసం వేడి చేసిన మేకు, సూది లేదా ఏదైనా పదునైన వస్తువును ఉపయోగించవచ్చు. తీగ సులభంగా దూరేందుకు రంధ్రాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు బట్టలు కుట్టినట్లుగా ఆ తీగను ఒక రంధ్రం నుంచి మరో రంధ్రంలోకి దూరుస్తూ మొత్తం భాగాన్ని గట్టిగా కుట్టేయాలి. విరిగిన భాగం గట్టిగా బిగుసుకునేలా తీగను బాగా లాగి ముడివేయాలి.

3 / 5
తీగ కట్టిన తర్వాత ఆ ప్రదేశంలో ప్లాస్టిక్ ఫిల్లర్, పుట్టీ లేదా ఏదైనా బలమైన రిపేరింగ్ కాంపౌండ్‌ను పలుచని పొరలా పూయాలి. దీనివల్ల రంధ్రాలు, లోపల ఉన్న తీగ కనబడకుండా మూసుకుపోతుంది. ఆ తర్వాత కుర్చీ రంగుకు సరిపోయే పెయింట్ వేస్తే సరే.. మీ కుర్చీ దాదాపు కొత్తదానిలా కనిపిస్తుంది.

4 / 5
How To Fix Broken Plastic (1)

How To Fix Broken Plastic (1)

5 / 5
ఇలా విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులను మీరు ఇంట్లోనే రిపేర్ చేసుకోవడం వల్ల మీరు కొత్తవి కొనాల్సిన పనిఉండదు. ఇది మీరు నెలవారి ఖర్చులను తగ్గించి.. ఆ అదనకు ఖర్చును ఆదా చేస్తుంది. కాబట్టి ఇకపై ఎప్పుడైనా ఇంట్లోని ప్లాస్టిక్ వస్తువులు విరిగిపోతే ఇలానే అతికించండి.

Loading...
Unable to load recommendations.
Follow Us