
గుడ్డు తెల్లసొనలో కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. కానీ అసలైన పోషకాలన్నీ పచ్చసొనలోనే దాగి ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, డి, ఇ, కె వంటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పచ్చసొనలో ఉండే కోలిన్ అనే మూలకం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె సమస్యలు ఉన్నవారు గుడ్డు పచ్చసొన తినకుండా ఉండాలి. వైద్యుల సలహా మేరకు ఇలాంటి వారు గుడ్డులోని తెల్లసొన మాత్రమే తినాలి.

ఎక్కువ గుడ్లు తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. డయాబెటిక్ రోగులకు గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వారానికి తినే గుడ్ల సంఖ్యను చాలా పరిమితం చేయాలి.

పచ్చసొన అందరికీ మంచిదే అయినప్పటికీ, కొందరు మాత్రం వైద్యుల సలహాతో తీసుకోవడం ఉత్తమం. ఇప్పటికే తీవ్రమైన గుండె జబ్బులు ఉన్నవారు, మధుమేహం, ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారు, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఇప్పటికే ప్రమాదకరంగా ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పచ్చసొనలో విటమిన్ B9 ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు, పుట్టబోయే బిడ్డ ఎదుగుదలకు అత్యంత అవసరమైన పోషకం. గుడ్డు పచ్చసొనను శత్రువులా చూడాల్సిన అవసరం లేదు. అది ప్రకృతి ప్రసాదించిన మల్టీ విటమిన్ క్యాప్సూల్ లాంటిది. అయితే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మితంగా తీసుకోవడం వల్ల దాని పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.