Kitchen Hacks: బెండకాయ వేపుడు జిగటగా రాకూడదంటే ఇలా చేయండి..

|

Jun 24, 2024 | 6:15 PM

కూరగాయల్లో బెండ కాయలు కూడా ఒకటి. బెండకాయల కర్రీ అంటే చాలా మందికి ఇష్టం. బెండకాయలో కూడా శరీరానికి మంచి చేసే ఎన్నో రకాల మంచి పోషకాలు ఉన్నాయి. బెండకాయలతో ఎలాంటి కర్రీ, వేపుళ్లు చేసినా చాలా రుచిగా ఉంటాయి. అయితే ఇందులో ఉండే జిగట అంటే నచ్చదు. కానీ బెండకాయల్లోని జిగురు ఆరోగ్యానికి చాలా మంచిది. కూర ఎంత రుచిగా ఉన్నా సరే.. పక్కన పెట్టేస్తారు. ముఖ్యంగా వేపుళ్లు చేసేటప్పుడు చాలా మంది ఈ సమస్యను ఎదుర్కునే ఉంటారు. కానీ ఇకపై ఆ సమస్య..

1 / 5
కూరగాయల్లో బెండ కాయలు కూడా ఒకటి. బెండకాయల కర్రీ అంటే చాలా మందికి ఇష్టం. బెండకాయలో కూడా శరీరానికి మంచి చేసే ఎన్నో రకాల మంచి పోషకాలు ఉన్నాయి. బెండకాయలతో ఎలాంటి కర్రీ, వేపుళ్లు చేసినా చాలా రుచిగా ఉంటాయి. అయితే ఇందులో ఉండే జిగట అంటే నచ్చదు.

2 / 5
కానీ బెండకాయల్లోని జిగురు ఆరోగ్యానికి చాలా మంచిది. కూర ఎంత రుచిగా ఉన్నా సరే.. పక్కన పెట్టేస్తారు. ముఖ్యంగా వేపుళ్లు చేసేటప్పుడు చాలా మంది ఈ సమస్యను ఎదుర్కునే ఉంటారు. కానీ ఇకపై ఆ సమస్య ఉండదు. ఎందుకంటే మీ కోసం మంచి బెస్ట్ చిట్కాలు తీసుకొచ్చాం.

3 / 5
బెండకాయలను తీసుకునేటప్పుడు లేత బెండకాయలను తీసుకోండి. చిన్నగా ఉండే బెండకాయల్లో జిగురు అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే విధంగా బెండకాయలను శుభ్రంగా కడగాలి. కట్ చేసి కాసేపు ఆరబెట్టి వేపుడు చేసుకుంటే జిగురు అనేది తగ్గుతుంది.

4 / 5
బెండకాయల్లో ఉండే జిగురును తగ్గించడానికి పెరుగు చక్కగా హెల్ప్ చేస్తుంది. బెండకాయ కర్రీ చేస్తున్నప్పుడు కొద్దిగా పెరుగు వేస్తే.. అందులో జిగురు పోతుంది. బెండకాయలను కట్ చేసిన తర్వాత పెరుగుతో కడిగినా జిగురు తగ్గుతుంది.

5 / 5
బెండకాయల్లో ఉండే జిగురు తగ్గాలంటే.. కూర వండేటప్పుడు పైన మూత పెట్టకండి. ఇలా చేస్తే జిగురు ఎక్కువ అవుతుంది. అదే విధంగా బెండకాయ వేపుడు చేసేటప్పుడు కొద్దిగా శనగ పిండి వేసి కలపండి. ఇలా చేసినా జిగట పోతుంది.