
ప్రతి ఇంట్లో ఉండే ప్రధాన సమస్యల్లో ఎలుకల బెడద కూడా ఒకటి.. ఇవి కిచెన్‌లోకి దూరి ఆహార పదార్థాలను కలుషితం చేయడమే కాకుండా ప్రమాదకర వ్యాధులు వచ్చేలా కూడా చేస్తాయి. వాటిని తరిమికొట్టేందుకు జనాలు మార్కెట్లో దొరికే ర్యాట్ ప్యాడ్స్‌ను వాడుతూ ఉంటారు. కానీ మనం రోజు వాడి పనికిరాదనే పాల ప్యాకెట్ సహాయంతో ఎలుకలను ఇంట్లో నుంచి ఈజీగా తరిమికొట్టొచ్చని చాలా మందికి తెలియదు.

దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.. ఇందుకోసం ముందుగా కడగని పాల కవర్‌ను తీసుకోవాలి. దాన్ని కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి లేదా మైదా లేదా శనగపిండిని ఏదైనా తీసుకోవచ్చు. ఈ మూడు మీకు చాలా ప్రభావవంతంగానే పనిచేస్తాయి.

ఇప్పుడు ఆ పిండిలో రెండు టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లం వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ తర్వాత పిండివంటలు చేసినప్పుడు ఉపయోగించిన మిగిలిన నూనెను పోసి పిండిని మరోసారి బాగా కలపాలి. ఈ పిండి ఉండాలి అంటే మీరు చపాతీలు చేసేందుకు పిండిని ఎలా కలుపుతారో అలా ఈ మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి.

తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ప్రతి ఉండ మధ్యలో చిన్న గుంట చేసి, ముందుగా కత్తిరించి పెట్టుకున్న పాల కవర్ ముక్కలను అందులో ఉంచి మళ్లీ ఉండలా చుట్టాలి. ఈ ఉండలను ఇంట్లో ఎలుకల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉంచాలి. అప్పుడు ఆ ఎలుకలు వాటిని తిని అస్వస్థతకు గురవుతాయి. అప్పుడు మీరు వాటిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లి వదిలేయవచ్చు.

అయితే మీరు ఎలుకలను చంపకుండా కేవలం తరికొట్టాలి అనుకుంటే ఈ పద్దతిని ఫాలో అవ్వకండి ఎందుకంటే.. వీటిని తినడం వల్ల ఎలుకలు చనిపోయే ప్రమాదం కూడా ఉండొచ్చు. కానీ దీనికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి వాటిని తిన్న ఎలుకలు చనిపోయాతయని స్పష్టంగా చెప్పలేము. అలాగే మీ ఇంట్లో పెట్స్, చిన్న పిల్లలు ఉంటే ఈ పద్దితి వాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి.Note: పైన ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేధికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు.