గరిబోళ్ల స్పెషల్ డ్రింక్.. డైలీ ఇలా తాగారంటే ఆ సమస్యలు రమ్మన్నారావు..

Updated on: Aug 25, 2026 | 5:22 PM

బార్లీ వేసవిలో శరీరానికి చలవనిస్తుంది.. ఇంకా తక్షణ శక్తిని అందిస్తుంది. పీచుపదార్థం, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండే బార్లీ జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. వేసవిలో బార్లీ నీటిని మజ్జిగతో కలిపి తరచుగా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

1 / 5
శరీరానికి ఎన్నో పోషకాలు అందించే బార్లీ వేసవికి సహజసిద్ధమైన ఔషధం లాంటిది. శరీరంలోని వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందించే గుణాలు ఇందులో పుష్కలం. బార్లీలోని పీచుపదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, జింక్, రాగి వంటి ముఖ్యమైన ఖనిజ లవణాలతో పాటు విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. ఈ పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడి, హార్ట్ ఎటాక్‌ను దూరం చేస్తాయి.

2 / 5
బార్లీ అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా, శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. బార్లీ శరీరంలో పేరుకుపోయిన అధిక నీటిని తొలగిస్తుంది.. మూత్ర సంబంధ సమస్యలను నియంత్రణలో ఉంచుతుంది.

3 / 5
అన్ని కాలాల్లో కూడా బార్లీ నీటికి మజ్జిగ, నిమ్మరసం, తేనె లేదా నారింజ రసాన్ని కలుపుకొని తాగితే రుచితో పాటు శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. అంతేకాకుండా.. శరీరాన్ని చల్లగా ఉంచి.. ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కాపాడుతుంది.

4 / 5
తయారీ విధానం.. బార్లీని లేత గోధుమ వర్ణం వచ్చేవరకు వేయించుకొని పొడి చేసుకోవాలి. మూడు కప్పుల నీటిని మరిగించి, రెండు చెంచాల బార్లీ పొడిని పావు కప్పు నీటిలో కలిపి, మరిగిన నీటిలో ఈ మిశ్రమాన్ని కలపాలి. 10 నిమిషాలు ఉడికించి, చల్లార్చి వడగట్టుకోవాలి.

5 / 5
ఈ నీటికి పావు గ్లాసు పల్చని మజ్జిగ, చిటికెడు ఉప్పు కలిపి ఈ వేసవిలో తరచుగా తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే.. ఏమైనా సమస్యలుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us