
అమ్మాయిల్లో చాలా మంది చుండ్రు సమస్యతో ఇబ్బంది పడతారు. వాళ్ళు దీనికి చెక్ పెట్టడం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతారు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. తినే ఫుడ్స్ లో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందోచ్చని నిపుణులు చెబుతున్నారు.

పెరుగు: పెరుగులో ఉండే యాంటీ ఫంగల్ చుండ్రు సమస్యకు చెక్ పెడుతోంది. కాబట్టి, దీనిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోండి. ఎందుకంటే, పెరుగును తిన్న తర్వాత తలలో చుండ్రు మొత్తం తగ్గుతుంది.

నిమ్మకాయ: నిమ్మకాయ మన ఆరోగ్యానికే కాదు చుండ్రును కూడా తగ్గిస్తుంది. దీనిలో ఉండే ఆమ్లం చుండ్రును పూర్తిగా తగ్గించి ఆ సమస్య నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది.

వేపాకులు: వేపాకులలో ఉండే యాంటీ ఫంగల్ చుండ్రుకు కారణమైన బ్యాకటిరియాను అంతం చేస్తుంది. కాబట్టి, వారంలో రెండు నుంచి మూడు సార్లు వేపాకుల రసం తలకి పట్టించి తల స్నానం చేయండి. కొద్దీ రోజుల్లోనే మీకు మార్పు తెలుస్తుంది

చేపలు: చుండ్రు సమస్య తగ్గించడంలో చేపలు కీలక పాత్ర వహిస్తాయి. అయితే, ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే, సాల్మన్ వంటి చేపలను తీసుకుంటే జుట్టు కూడా బాలంగా ఉంటుంది.