ఖరీదైన క్రీమ్స్ వద్దూ.. ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో ఈజీగా పాదాల పగుళ్లకు చెక్ పెట్టండి!

Updated on: Sep 28, 2026 | 7:00 AM

సీజన్లతో సంబంధం లేకుండా కాళ్ల పగుళ్లు చాలామందిని వేధించే సాధారణ సమస్య. ముఖ్యంగా చలికాలంలో పొడి వాతావరణం, గాలిలో తేమ లేకపోవడం వల్ల ఇది తీవ్రమవుతుంది. పాదాల పట్ల సరైన శ్రద్ధ తీసుకోకపోవడం, పోషకాహార లోపం, వృద్ధాప్యం, ఎక్కువసేపు గట్టి ఉపరితలాలపై నిలబడటం వంటివి దీనికి ప్రధాన కారణాలు. కొన్నిసార్లు పగుళ్ల నుంచి రక్తం కారి, తీవ్రమైన నొప్పితో నడవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అయితే, ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో దీన్ని సులభంగా పరిష్కరించుకోవచ్చు.అదెలానో చూద్దాం

1 / 5
పగిలిన పాదాలకు ఉపశమనం కలిగించడానికి ముందుగా పాదాలను గోరువెచ్చని నీటిలో కొద్దిసేపు ఉంచాలి. ఆ తర్వాత ఉప్పులో అద్దిన నిమ్మ తొక్కను తీసుకుని పగుళ్లపై సున్నితంగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ కణాలు తొలగిపోవడమే కాకుండా, ఇన్ఫెక్షన్లు దరిచేరవు. ఫలితంగా పాదాలు మరింత పగలకుండా సురక్షితంగా ఉంటాయి.

2 / 5
పాదాలకు తగిన మాయిశ్చరైజింగ్ అందించడం చాలా ముఖ్యం. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా బాదం నూనె రాస్తే పగిలిన పాదాలు నయమై మృదువుగా మారతాయి. అలాగే, రాత్రి పడుకునే ముందు పాదాలకు ఆముదం నూనె పట్టించి, ఉదయం వేడి నీటిలో పది నిమిషాలు ఉంచి గట్టి వస్త్రంతో రుద్దాలి. ఒక టీస్పూన్ ఆముదం నూనెలో ఒక నిమ్మకాయ రసం పిండి మడమలకు రాసినా చాలా త్వరగా పగుళ్లు తగ్గుతాయి.

3 / 5
రాత్రి నిద్రపోయే ముందు రోజ్ వాటర్, గ్లిజరిన్‌ను సమాన పరిమాణంలో తీసుకుని పాదాలకు అప్లై చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇది పాదాలను మృదువుగా, తేమగా ఉంచుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఒక్కో టీస్పూన్ నిమ్మరసం, రోజ్ వాటర్, క్యాస్టర్ ఆయిల్ తీసుకుని బాగా కలపాలి. ప్రతిరోజూ రాత్రి ఈ మిశ్రమాన్ని మడమలకు రాసుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే పగుళ్ల సమస్య మాయమవుతుంది.

4 / 5
వేపాకులను మెత్తగా నూరి, అందులో పసుపు కలిపి పగుళ్లపై రాస్తే రెండు రోజుల్లోనే నొప్పి తగ్గి పాదాలు మృదువుగా మారతాయి. వేపలోని యాంటీ ఫంగల్ లక్షణాలు, పసుపులోని యాంటీ బయోటిక్ గుణాలు బ్యాక్టీరియాను సమర్థవంతంగా నివారిస్తాయి. అలాగే పసుపు, తులసి, తేనె, అలోవెరా కలిపిన మిశ్రమాన్ని పగుళ్లపై అప్లై చేసినా పాదాలు మృదువుగా, అందంగా తయారవుతాయి.

5 / 5
పగుళ్లు మరీ తీవ్రంగా ఉంటే.. ఐదు టీస్పూన్ల వాసిలీన్‌లో ఒక టీస్పూన్ బోరిక్ పౌడర్ కలిపి మడమల సందుల్లో పూయాలి. ఇది లోపలి నుంచి నయం చేసి కొన్ని రోజుల్లోనే పగుళ్లను తగ్గిస్తుంది. ఒకవేళ పగుళ్లు మరీ ఎక్కువగా ఉంటే, కొద్దిగా గోరువెచ్చని నెయ్యిని పగుళ్ల మధ్య ఒక్కో చుక్క వేసి దూదితో అద్దాలి. మొదట్లో కాస్త మంటగా అనిపించినా, వేగంగా పగుళ్లు మాయమై ఉపశమనం లభిస్తుంది. Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదిక ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని పాటించే ముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి.

Loading...
Unable to load recommendations.
Follow Us