
శ్రీదేవి అప్పల్ల గురిచి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు కోర్టు సినిమాతో తెలుగు అభిమానులకు దగ్గరైంది. కోర్టు మూవీలో జాబిలి పాత్రలో నటించి, తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీంతో ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ లెవల్లో ఫేమ్ సంపాదించుకుంది.

ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు వరసగా అవకాశాలు రావడంతో, వరస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, వరుస సినిమాలతో దూసుకెళ్లుతుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నట్లు సమాచారం. ఈ బ్యూటీ త్వరలో హైకూ అనే సినిమాతో అభిమానుల ముందుకు రానుంది. అంతే కాకుండా కోర్టు మూవీ హీరో సరసన, బ్యాండ్ మేళం అనే మరో సినిమా కూడా చేస్తుంది.

ఇక సినిమాల పరంగా బిజీగా ఉండటమే కాకుండా, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ లేత గులాబీ రంగు లెహెంగాలో ఉన్న అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫెస్‌పై ఓలుక్ వేయండి.