ఒంట్లో కొవ్వు తగ్గడం లేదా.? కొబ్బరినీళ్లతో కూడా బరువు తగ్గొచ్చు..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Updated on: Mar 16, 2025 | 7:39 AM

శరీరంలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన కొవ్వు తగ్గడం నేటి అతిపెద్ద ఆరోగ్య సమస్య. దీనికోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక వైద్యం, ఇంటి చిట్కాలను పాటిస్తూనే ఉంటారు. కానీ, ఆశించిన ఫలితాలు కనిపించవు. అలాంటివారికి కొబ్బరి నీళ్లు దివ్యౌషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎన్ని వ్యాయామాలు, ఆహారంలో ఎన్ని మార్పులు చేసినా మీ బరువు మీటర్‌ను కదిలించలేకపోతే, కొబ్బరి నీళ్ళు తీసుకోవడం ప్రారంభించండి. ఇది మీ వెయిట్‌లాస్ జర్నీలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుందని సూచిస్తున్నారు. అదేలాగో పూర్తి వివరాల్లోకి వెళితే...

1 / 5
కొబ్బరి నీళ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటితో శరీరంలో కొవ్వు పేరుకుపోదు. కొబ్బరి నీళ్లు బరువు తగ్గించడమే కాకుండా ఉబ్బరం, శరీరం నీటిని నిలుపుకోవడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. బరువు తగ్గడంలో కొబ్బరి నీళ్లు ప్రభావవంతంగా పనిచేస్తాయిన పలువురు డైటిషీయన్లు సైతం చెబుతున్నారు. ఇందులో ఎలక్ట్రోలైట్ పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుతుంది.

2 / 5
పొటాషియం అధికంగా ఉండటం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నీటి నిలుపుదలకు కారణమయ్యే సోడియం ప్రభావం సమతుల్యమవుతుంది. ద్రవ సమతుల్యత ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. దీనితో జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

3 / 5
ఇకపోతే, కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం , విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమైనవి. జీవక్రియ , శక్తి ఉత్పత్తికి తోడ్పడతాయి, ఇవి బరువు నిర్వహణలో కీలక కారకాలు.

4 / 5
కొబ్బరిలో ఉండే ఎలక్ట్రోలైట్లు ఆరోగ్యకరమైన జీవక్రియను కూడా అందిస్తాయి. ఇది బరువు తగ్గించే ప్రక్రియను సులభతరం చేస్తుంది. అధిక కేలరీలు కలిగి ఉండే ఇతర పానీయాలకు బదులుగా కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల మొత్తం క్యాలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గించే ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది.

5 / 5
కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా తరచుగా సహజ స్పోర్ట్స్ డ్రింక్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం తర్వాత కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను తిరిగి శరీరానికి అందజేస్తుంది. బరువు తగ్గడంలో సమర్థవంతంగా సహాయపడుతుంది.