
రక్తం లేదని బాధ పడకుండా ఈ కొబ్బరి, బీట్ రూట్ పచ్చడి తింటే చిటికెలో రక్తం పెరుగుతుంది. అయితే, వీళ్ళు కనీసం రెండు రోజులకొక తింటే రక్తం బాగా పడుతుంది. అన్నంతో కానీ రోటీతో కానీ తింటే టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్దాలు ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు కొబ్బరి తురుము, మూడు బీట్ రూట్ లు , 10 పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ పుట్నాలు, 6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, నిమ్మకాయ సైజు చింతపండు, నిమ్మరసం, రెండు గ్లాసుల నీళ్ళు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, ఆవాలు, జీలకర్ర, మూడు ఎండుమిర్చి , కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా ఒక కప్పు కొబ్బరి తురుము, బీట్ రూట్ , పచ్చిమిర్చి, పుట్నాలు, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు కూడా వేసి పాన్ లో బాగా మగ్గించుకోవాలి. అయితే, వీటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో మరి నీరు పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇంకోసారి తిప్పుకుంటే సరిపోతుంది.

ఆ తర్వాత అవసరమైతే ఒక గ్లాస్ నీళ్లు పోసి మళ్లీ తిప్పుకోవాలి. అయితే, మరి గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసి దోసెల్లో తింటే రుచి అద్భుతం. చివర్లో పోపు ఒక పాన్ పెట్టి, దానిలో నూనె వేసి అది బాగా వేడి అయిన తర్వత మీడియం మంటపై ఉంచి కిందకు దించేయాలి.

ఆ పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటే ప్రతి ముద్ద అదిరిపోతోంది. ముఖ్యంగా, రక్తం లేని వారికి ఈ కొబ్బరి, బీట్ రూట్ పచ్చడి మేలు చేస్తుంది. ఇంకా మంచి సువాసనతో నోరూరిస్తుందో. ఈ సారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి.