
డిగ్రీ పూర్తికాగానే.. జాబ్ చేయాలి అనే మైండ్ సెట్‌తో చాలా మంది యువత నగరాలవైపు పరుగుతు తీస్తుంటే.. ఓ యువకుడు మాత్రం వ్యవసాయాన్నే తన కెరీర్‌గా ఎంచుకుని సరికొత్త ఆదర్శంగా నిలిచాడు. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆ యువకుడు సాఫ్ట్‌వేర్, ఉద్యోగం, ఏసీ గదులు వద్దనుకొని ఆధునిక వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేస్తూ లక్షలు సంపపాదిస్తున్నారు. అతనే మహారాష్ట్రలోని వాశింబే గ్రామానికి చెందిన అభిజిత్ పాటిల్.

2015లో పుణెలోని డి.వై. పాటిల్ కాలేజ్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన పాటిల్.. తన ఫ్రెండ్స్ అంతా సాఫ్ట్‌వేర్ జాబుల్లో కెరీర్‌ను వెతుక్కుంటే.. అతను మాత్రం వ్యవసాయాన్నే తన కెరీర్‌గా మల్చుకున్నాడు. 2020లో తనకున్న నాలుగు ఎకరాల భూమిలో ఎర్ర అరటి తోటను సాగు చేయడం స్టార్ట్ చేశాడు. రెండేళ్లలోనే పంట చేతికి రావడంతో.. తన పంటను అమ్మేందుకు సరైన మార్కెటింట్ స్టార్టజీని అమలు చేశాడు.

తన పంటను మార్కెట్‌లో అమ్మకుండా.. నేరుగా రిటైల్ ఔట్లెట్లకు సరఫరా చేయడం ప్రారంభించాడు. ఇలా తన నాలుగు ఎరకాల పొలంలో పండిన మొత్తం 60 టన్నుల ఎర్ర అరటిని పుణె, ముంబై, ఢిల్లీలోని రిలయన్స్, టాటా రిటైల్ ఔట్‌లెట్లకు నేరుగా సప్ల చేసి.. ఏకంగా రూ. 35 లక్షలకు పైగా సంపాధించాడు.

ఎర్ర అరటి సాగుకు ఎలాంటి నేలలు అనుకూలం?: మీరు కూడా అభిజిత్‌లా అరటి సాగుతో డబ్బులు సంపాధించాలి అనుకుంటే.. మొదటి దానికి అనుమైన నేల ఏదో తెలుసుకోవాలి. అవును ఎర్ర అరటి సాగు బాగా రావాలి అంటే లోతైన, సారవంతమైన నేలలు చాలా కీలకం. ఆ నేలకు తేమను నిలుపుకునే సామర్థ్యం ఉండాలి, కానీ నీరు నిల్వ ఉండకూడదు. నేల పీహెచ్ (pH) విలువ 6 నుండి 7.5 మధ్య ఉంటే బెటర్. నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండే నేలల్లో ఈ పంట బాగా పెరుగుతుంది.

ఎర్ర అరటి ప్రాముఖ్యత: నార్మల్‌గా మనం పసుపు రంగు అరటి పండ్లనే ఎక్కువగా చూసి ఉంటాం లేదా పచ్చ అరటి కాయలను చూసి ఉంటాము.దాదాపు ఇవి కూడా రుచికిగా వాటిలానే ఉంటాయి. కానీ పైన తొక్క మాత్రం ఎరుపు లేదా మెరూన్ రంగులో ఉంటుంది. ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి6తో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని కూడా మన సాదారణ అరటి పండ్లలాలనే అహారంలో చేర్చుకోవచ్చు.