
టాలీవుడ్ లో కొత్త అందాలు ప్రేక్షకులను కవ్విస్తున్నాయి. ఈ క్రమంలోనే శివాని నాగరం అనే ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు కేవలం నటి మాత్రమే కాదు గాయని , కూచిపూడి నృత్యకారిణి కూడా.. ఈ ముద్దుగుమ్మ 2024లో విడుదలైన "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రంలో ఆమె సుహాస్ సరసన లక్ష్మి పాత్రలో నటించి, తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. శివాని ఈ అవకాశాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వచ్చిన ఆడిషన్ మెసేజ్ ద్వారా పొందింది, మొదట హీరోయిన్ స్నేహితురాలి పాత్ర కోసం వెళ్లి, తర్వాత హీరోయిన్‌గా ఎంపికైంది.

ఆమె ప్రస్తుతం "లిటిల్ హార్ట్స్" అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా, శివాని గాయనిగా కూడా తన ప్రతిభను చూపించింది, "ఆరంభం" అనే సినిమాలో "అమాయకంగా" అనే పాటను ఆలపించింది, ఇది ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది.

ప్రస్తుతం సుహాస్ హీరోగా నటిస్తున్న హే భగవాన్ సినిమాలో నటిస్తుంది ఈ అమ్మడు. ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ.. తన ఫొటోలతో అభిమానులను ఆకర్షిస్తోంది. ఈ బ్యూటీ ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.

ఆమె తన సహజమైన అందం, నటనా నైపుణ్యంతో యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటుంది. శివాని హైదరాబాద్‌కు చెందిన తెలుగు అమ్మాయి. తెలుగు నటీమణులకు సినిమా రంగంలో మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటుంది ఈ భామ.