
Srఅందాల భామ శ్రీలీల.. తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేనిపేరు. చేసింది తక్కువ సినిమాలే అయిన విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ. తెలుగులో పెళ్లి సందD సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది శ్రీలీల.

ఈ మూవీ తర్వాత తెలుగులో శ్రీలీలకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ధమాకా సినిమా తర్వాత అనేక ప్రాజెక్ట్స్ చేసినప్పటికీ ఆ స్థాయిలో హిట్టు మాత్రం రాలేదు. కానీ వరుసగా ఆఫర్స్ మాత్రం అందుకుంటుంది. అందం, అభినయంతోపాటు ఎనర్జీటిక్ డ్యాన్స్ తో ఆకట్టుకుంది. దీంతో తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. ఓవైపు స్టార్ హీరోలకు జోడిగా నటిస్తూనే.. మరోవైపు కుర్రహీరోలస సరసన నటించింది.

అయితే కొన్నాళ్లుగా ఈ బ్యూటీ నటించిన చిత్రాలు తెలుగులో ప్లాప్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. అయితే వరుసగా ప్లాపులు వస్తున్నప్పటికీ శ్రీలీల డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ఇటీవలే పరాశక్తి సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.

తెలుగులో ఈ అమ్మడు ఇప్పటివరకు పది సినిమాల్లో నటించింది. వాటిలో హిట్ అయినవి రెండే రెండు సినిమాలు అందులో ఒకటి ధమాకా అయితే మరొకటి భగవంత్ కేసరి సినిమా.. అయితే భగవంత్ కేసరి సినిమా బాలయ్య ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. దాంతో ఈ అమ్మడికి తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. ప్రస్తుతం శ్రీలీల అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది శ్రీలీల. ఈ చిన్నదాని ఫోటోలకు ఫిదా అవుతున్నారు కుర్రకారు.