
విత్ లవ్.. ఇటీవల యూత్ ను తెగ ఆకట్టుకున్న మలయాళం సినిమా ఇది. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన అభిషన్ జీవింత్ ఈ సినిమాతో హీరోగానూ మారిపోయాడు. కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మధన్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీలో మలయాళ నటి, ఛాంపియన్ మూవీ హీరోయిన్ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇదే సినిమాలో అనీషా అనే ముస్లిం అమ్మాయి పాత్రలో ఓ క్యూట్ గర్ల్ తన నటనతో అందరినీ కట్టిపడేసింది.

సినిమాలో ఎక్కువగా స్కూల్ డ్రెస్, బురఖా, పంజాబీ తదితర ట్రెడిషినల్ దుస్తుల్లో కనిపించిన ఆ అమ్మాయి పేరు కావ్య అనిల్. అయితే అనస్వర లాగే ఈ ముద్దుగుమ్మ కూడా మలయాళం నటినే అని తెలుస్తోంది.

గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన కావ్యకు 'విత్ లవ్' నే మొదటి సినిమా అని తెలుస్తోంది. అయితేనేం తన క్యూట్ యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ తో అందరినీ కట్టి పడేసిందీ అందాల తార.

ముఖ్యంగా ఈ అమ్మాయికి, హీరోకు మధ్య వచ్చే సీన్లకు ఆడియెన్స్ చప్పట్లు కొడతారు. అయితే సినిమాలో ట్రెడిషినల్ గా కనిపించే కావ్య రియల్ లైఫ్ లో మాత్రం మోడరన్ గానూ, గ్లామరస్ గానూ ఉంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కావ్య తరచూ తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. ఇవి క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. కావ్య ఫొటోలకు నెటిజన్లు నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది.