Ticket Rates: సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీ ఆలోచనలో మార్పు.. టికెట్ రేట్లు తగ్గేనా.?

Updated on: Feb 07, 2025 | 9:30 AM

ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ మీద వినిపిస్తున్న మేజర్ కంప్లయింట్‌ టికెట్ రేట్స్‌. భారీ బడ్జెట్‌ చిత్రాల విషయంలో టికెట్‌ రేట్స్ రెండు మూడు రెట్లు పెంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ప్రైజెస్‌ సినిమాల సక్సెస్‌ విషయంలో ఎంత హెల్ప్ అవుతున్నాయో... ఫెయిల్యూర్‌కి కూడా అంతే కారణం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ప్రజెంట్ సిచ్యుయేషన్‌లో టికెట్‌ రేట్లు పెంచకుండా సినిమా లాభాలు సాధించటం సాధ్యం కాదా..?

1 / 5
మన సినిమా స్థాయి పెరిగింది. వసూళ్ల లెక్కలు మారిపోయాయి. అందుకు తగ్గట్టుగా బడ్జెట్‌ లెక్కలు కూడా మారాయి. ఒక్కో సినిమాను వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఆ మొత్తాన్ని రికవర్‌ చేసుకునేందుకు టికెట్‌ రేట్లు కూడా అదే స్థాయిలో పెంచేస్తున్నారు మేకర్స్‌.

2 / 5
తొలి వారంలోనే పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. అయితే ఈ టికెట్‌ రేట్లు పెంచటం విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సంక్రాంతి రిలీజ్‌ల తరువాత ఇండస్ట్రీ ఆలోచన పూర్తిగా మారిపోయింది. 

3 / 5
 పొంగల్ బరిలో రిలీజ్ అయిన సినిమాల విషయంలో పెద్దగా టికెట్‌ రేట్లు పెంచలేదు. గేమ్ చేంజర్‌, డాకు మహారాజ్‌ సినిమాలకు పెంచినా నామినల్‌గానే. అయినా ఈ సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సీజన్‌లో రిలీజ్ అయిన మూడు సినిమాలు వంద కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి కొత్త చరిత్ర సృష్టించాయి.

4 / 5
సంక్రాంతి సినిమాల సక్సెస్‌ కొత్త డిస్కషన్‌కు తెర లేపింది. ఇక మీదట పెద్ద సినిమాల విషయంలోనూ టికెట్‌ రేట్లు పెంచాల్సిన అవసరం లేదని నిర్మాతలు భావిస్తున్నారా..? రెగ్యులర్ టికెట్ రేట్స్‌తోనే పెద్ద సినిమాలను కూడా రిలీజ్ చేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. అయితే అన్ని సినిమాల విషయంలో పరిస్థితి ఇలాగే ఉంటుదని చెప్పలేం అన్నది మరో వర్షన్‌. కొన్ని సందర్భాల్లో సినిమా స్థాయిని బట్టి టికెట్‌ రేట్లు పెంచాల్సి అవసరం కూడా ఉంటుందన్నది ఇండస్ట్రీ జనాలు చెబుతున్న వర్షన్‌.

5 / 5
ఏది ఏమైనా సామాన్యుడికి టికెట్‌ రేట్లు అందుబాటులోనే ఉండాలన్న మాట మాత్రం ప్రేక్షకుల వైపు నుంచి గట్టిగా వినిపిస్తోంది. సరైన కంటెంట్‌తో వస్తే టికెట్‌ రేట్లు పెంచకపోయినా... అలాంటి సినిమాలు భారీ వసూళ్లు సాధించిన దాఖలాలు ఉన్నాయన్నది ఆడియన్స్ మాట. మరి ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దల ఆలోచన ఎలా ఉంటుందో చూడాలి.