
బిగ్ బాస్ సీజన్ 10 రసవత్తరంగా సాగుతుంది. మొత్తం హౌస్ లోకి 16మంది హౌస్ మేట్స్ ఎంట్రీ ఇచ్చారు. కాగా తొలి వారమే హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. మొదటి వారం మిడ్ వీక్ లోనే చరణ్, చైత్ర హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తతం హౌస్ లో 14మంది ఉన్నారు. కాగా ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. సోమవారం జరిగిన నామినేషన్స్ లో ఏకంగా 11మంది నామినేట్ అయ్యారు.

కేవలం ముగ్గురు మాత్రమే నామినేషన్స్ లో లేరు. దాంతో ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నవారిలో 1. షాలిని 2. త్రిగుణ్ 3. ఝాన్సీ 4. దేబ్జానీ 5. రాంప్రసాద్ 6. ముఖేష్ 7. కృష్ణుడు 8. సుధీర్ 9. సృష్టి 10. వర్షిణి 11. రోహిత్. అయితే అమన్, వంశీ, నరేష్‌లు మాత్రమే ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.ఇడియోల

ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీల పై సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈసారి వైల్డ్ కార్డు ద్వారా ఈసారి మరింత మంది కంటెస్టెంట్స్ ను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తుంది. లేడీ కంటెస్టెంట్ల కోటాలో ఓ అందాల భామ ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. ఆమె ఎంట్రీ దాదాపు ఖాయం అయ్యిందని టాక్. ఇంతకూ ఆమె ఎవరో కాదు.

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్న సురేఖ వాణి కూతురు సుప్రీత. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హీరోయిన్స్ కు మించి ఈ చిన్నదానికి నెట్టింట మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తోనే ఇప్పుడు సినిమాల్లోకి రానుంది. ఇప్పటికే రెండు సినిమాలు చేసింది. ఒక సినిమా విడుదలైంది. మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు సుప్రీత బిగ్ బాస్ హౌస్ లోకి రానుందని తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లోకి సుప్రీత వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఆమెను బిగ్ బాస్ టీమ్ సంప్రదించారని ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. మరి ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.