Niharika-Chaitanya Divorce: మెగా డాటర్‌ నీహారిక-చైతన్యల విడాకులకు అసలు కారణం అదేనా..?

|

Jul 05, 2023 | 5:40 PM

సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు వెంటవెంటనే జరిగిపోతుంటాయి. సెలబ్రెటీ జంటలు విడిపోవడం వెంటనే మరో పెళ్లికి రెడీ అయిపోవడం ఈ రోజుల్లో షరా మామూలై పోయింది. తాజాగా టాలీవుడ్‌లో మరో క్యూట్‌ జంట విడిపోయింది. కొనిదేల నీహారిక, ఆమె భర్త జొన్నలగడ్డ చైతన్యకు తాజాగా..

1 / 5
సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు వెంటవెంటనే జరిగిపోతుంటాయి. సెలబ్రెటీ జంటలు విడిపోవడం వెంటనే మరో పెళ్లికి రెడీ అయిపోవడం ఈ రోజుల్లో షరా మామూలై పోయింది. తాజాగా టాలీవుడ్‌లో మరో క్యూట్‌ జంట విడిపోయింది. కొనిదేల నీహారిక, ఆమె భర్త జొన్నలగడ్డ చైతన్యకు తాజాగా విడాకులు మంజూరయ్యాయి. ఈ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు.

2 / 5
నాగబాబు కూతురు నీహారికకు, గుంటూరు ఐజీ జె ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో 2020 డిసెంబర్‌లో అంగరంగ వైభవంగా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లిని మెగా కుటుంబం ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. నిహారిక-చైతన్య పెళ్లిని నేషనల్ మీడియా కూడా కవరేజ్ చేసిందంటే ఏ రేంజ్‌లో వీరి పెళ్లి జరిగిందో తెలుస్తోంది.

3 / 5
పెళ్లి తర్వాత వీరి కాపురం కొన్ని రోజులు సజావుగా సాగినా..ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ప్రారంభమయ్యాయి. ఇద్దరిదీ వేరేవేరు రంగాలు కావడం కూడా ఓ కారణమే. చైతన్య సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్, నిహారిక సినిమా ఇండస్ట్రీ. పైగా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలనే కండిషన్‌ నీహారికకు చైతన్య కుటుంబం పెట్టినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అందుకే పెళ్లి తర్వాత నీహారిక షూటింగ్‌లకు దూరంగా ఉందని వార్తలు వినిపించాయి. కొన్ని రోజులు బాగానే ఉన్న నీహారిక అందుకు ఒప్పుకొకపోవడంతో ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి ఉంటాయని సమాచారం.

4 / 5
ఆ మధ్య డ్రగ్స్‌ కేసులో కూడా నీహారిక పేరు వినిపించింది. భేదాభిప్రాయాలు రావడంతో ఇద్దరూ చాలా రోజులుగా వేరువేరుగానే ఉంటున్నారు. దీంతో మే 19న కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నారు. తాజాగా కోర్టు డివోర్స్ మంజూరు చేసింది. దీంతో అధికారికంగా ఇద్దరు విడిపోయారు. కొన్ని రోజులుగా వరుస షూటింగ్‌లు చేసుకుంటూ నీహారిక బిజీగా ఉంటోంది. హాట్ ఫోటోషూట్స్ కూడా చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తోంది.

5 / 5
ఇదంతా చూస్తుంటే విడాకుల ప్రభావం నీహారికపై పెద్దగా పడినట్లు కనిపించడం లేదు. మరోవైపు చైతన్య కూడా మీడియాకు దూరంగా ఉంటున్నాడు. మెగా ఫ్యామిలీలో వరుస విడాకులు ఫ్యాన్స్‌ను కొంత నిరాశపరుస్తున్నాయి.   చిరంజీవి కూతురు శ్రీజ, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తల్లి ఇప్పటికే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.