
Kబుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు'. త్వరలోనే సరికొత్త రికార్డులతో 10వ సీజన్‌లోకి అడుగుపెట్టబోతోంది. అయితే ఈసారి షో సరికొత్తగా ఉంటుందని ఇదివరకే హోస్ట్ నాగార్జున ప్రకటించారు. అటు అగ్నీ పరీక్ష కోసం సన్నహాలు చేస్తున్న మేకర్స్.. ఈ పదవ సీజన్‌ను మేకర్స్ మరింత గ్రాండ్‌గా, మునుపెన్నడూ లేని విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో ఇప్పటినుంచే రకరకాల ఊహాగానాలు, పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ఈ లిస్ట్‌లో ప్రముఖ సీరియల్ నటి కావ్య శ్రీ (Kavya Shree) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తన నటనతో, క్యూట్ లుక్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన కావ్య శ్రీ.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిరంతరం సరికొత్త ఫోటోషూట్లతో అలరించే ఈ ముద్దుగుమ్మ, తాజాగా షేర్ చేసిన స్టైలిష్ అండ్ స్టన్నింగ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె గ్లామర్, కాన్ఫిడెన్స్ చూసిన నెటిజన్లు.. "ఈమె బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే షో గ్లామర్ మరింత పెరగడం ఖాయం" అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సాధారణంగా బిగ్ బాస్ షోలో సీరియల్ నటీనటులకు మంచి క్రేజ్ ఉంటుంది. గడిచిన సీజన్లలో సీరియల్ ఆర్టిస్టులు టైటిల్ రేసులో నిలవడమే కాకుండా, కొందరు విజేతలుగా కూడా నిలిచారు. కావ్య శ్రీకి ఉన్న ఫ్యాన్ బేస్ , ఆమెకున్న పాపులారిటీ దృష్ట్యా, ఆమె బిగ్ బాస్ 10 హౌస్‌లోకి అడుగుపెడితే గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె హౌస్‌లో తన రియల్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ క్రేజీ ఎంట్రీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, కావ్య శ్రీ అభిమానులు మాత్రం ఆమెను బిగ్ బాస్ వేదికపై చూడటానికి ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, బిగ్ బాస్ సీజన్ 10 మరింత రసవత్తరంగా మారడం ఖాయం. కావ్య శ్రీ.. బుల్లితెరపై చాలా ఫేమస్.. కోయిలమ్మ సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత చిన్ని సీరియల్ ద్వారా మరింత పాపులర్ అయ్యింది. ఈ సీరియల్లో తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.

చిన్ని సీరియల్ ద్వారా మరో ధారవాహిక చేయలేదు. కానీ కొన్ని నెలలుగా పలు షోలలో సందడి చేస్తూ స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరలవుతుంది. క్రీమ్ కలర్ మోడ్రన్ అవుట్ ఫిట్ లో ఈ బ్యూటీ కవ్విస్తుంది. చాలా కాలంగా కావ్య శ్రీ పేరు బిగ్ బాస్ ఎంట్రీలోకి ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. గతేడాది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు మరోసారి కావ్య శ్రీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.