Tollywood : ఆ ఒక్క హీరోతోనే మూడు సినిమాలు చేయాల్సింది మిస్ అయ్యా..

Updated on: Oct 21, 2026 | 2:31 PM

తెలుగు సినీ పరిశ్రమలో కొందరు హీరోయిన్లు చాలా తక్కువ సినిమాలతోనే ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. అందం, అభినయంతో ఆకట్టుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్న అలాంటి నటీమణుల్లో రేఖ వేదవ్యాస్ ఒకరు. కెరీర్ ఆరంభంలోనే వరుస విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ..

1 / 5
తెలుగు సినీ పరిశ్రమలో కొందరు హీరోయిన్లు చాలా తక్కువ సినిమాలతోనే ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. అందం, అభినయంతో ఆకట్టుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్న అలాంటి నటీమణుల్లో రేఖ వేదవ్యాస్ ఒకరు. కెరీర్ ఆరంభంలోనే వరుస విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత అనూహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఆమె.. కొంతకాలం పాటు ఇండస్ట్రీకి, సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి.

2 / 5
తాజాగా తన సినీ ప్రయాణం, కెరీర్‌లో ఎదురైన అనుభవాల గురించి రేఖ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. రేఖ వేదవ్యాస్‌కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో ‘ఆనందం’ ఒకటి. ఈ సినిమా విజయంతో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు రావడంతో కెరీర్‌లో ముందుకు సాగారు. ‘ఒకటో నంబర్ కుర్రాడు’, ‘దొంగోడు’, ‘జానకి వెడ్స్ శ్రీరామ్’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. తన అందం, నటనతో యువతలోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

3 / 5
ఆ సమయంలో రేఖ స్టార్ హీరోయిన్ అవుతుందని చాలామంది భావించారు. స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకు అవసరమైన గుర్తింపు, అవకాశాలు ఆమెకు లభించాయి. అయితే కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే ఆమె సినిమాలకు దూరం కావడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.  ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి మాట్లాడిన రేఖ వేదవ్యాస్.. కెరీర్‌లో చేజారిన అవకాశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దివంగత నటుడు ఉదయ్ కిరణ్‌తో కలిసి నటించే అవకాశాలు వచ్చినప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయానని ఆమె తెలిపింది.

4 / 5
ముఖ్యంగా ఉదయ్ కిరణ్ నటించిన ‘కలుసుకోవాలని’ సినిమాకు తొలుత తనను ఎంపిక చేసినట్లు, అయితే అనివార్య కారణాలతో ఆ చిత్రంలో నటించలేకపోయినట్లు పేర్కొంది. దీంతోపాటు మరో రెండు సినిమాల్లోనూ ఆయనతో కలిసి నటించే అవకాశాలను కోల్పోయినట్లు వెల్లడించింది. ఈ మూడు అవకాశాలు తన కెరీర్‌లో మిస్ కావడం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సినిమాలకు దూరం కావడానికి గల కారణాలపై కూడా రేఖ తన మనసులోని మాటలను పంచుకుంది.

5 / 5
తాను కావాలని సినిమాలను వదిలేయలేదని, జీవితంలో అనుకున్నవి అన్నీ అనుకున్నట్లుగా జరగవని చెప్పుకొచ్చింది. మనం ఒకటి అనుకుంటే.. విధి మరోలా నిర్ణయిస్తుందని అభిప్రాయపడింది. కెరీర్‌లో ఒక దశలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్న సమయంలోనే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని ఆమె పేర్కొన్నారు. క్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో మానసికంగా ఎంతో బాధపడ్డానని, జీవితంలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని వెల్లడించింది. ఒకప్పుడు ఎంతో బిజీగా ఉన్న తన సినీ ప్రయాణం ఇలా మారిపోవడం బాధ కలిగించిందనే భావనను వ్యక్తం చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us