
పురుషాధిక్యం ఎక్కువగా కనిపించే సినిమా పరిశ్రమలో కొందరు తమ అధికారం, డబ్బు, హోదాని వాడుకుని.. నటీమణులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.

కొందరు ఈ దారుణాలను మౌనంగా సహిస్తుంటే మరికొందరు మాత్రం ధైర్యంగా ముందుకొస్తున్నారు. ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ పై గళమెత్తుతున్నారు

తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఎస్తర్ నోరోన్ క్యాస్టింగ్ కౌచ్ పై మరో బాంబు పేల్చింది. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటికీ కొందరు కమిట్‌మెంట్ కావాలంటూ తనను సంప్రదిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిందీ అందాల తార.

భీమవరం బుల్లోడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ కథానాయికగా మెప్పించిన మె ఇప్పుడు సహాయక నటిగా బిజీ బిజీగా ఉంటోంది.

తాజాగా ఆమె ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది. ఆడవాళ్లకు సినిమా ఇండస్ట్రీలో చాలా రకాల ఒత్తిడులు ఉంటాయని పేర్కొంది.

ప్రేక్షకుల ప్రేమ, మీడియా సపోర్ట్ తనకు ఉన్నాయని, అయినా కూడా కొందరు తనను కమిట్మెంట్ అడుగుతున్నారని ఎస్తర్ వాపోయింది. అయితే వారెవరో మాత్రం చెప్పలేదీ అందాల తార. కానీ ఈ బ్యూటీ మాటలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.