అతను చాలా అందంగా ఉంటాడు.. స్టార్ హీరోపై మనసుపడ్డ తమన్నా

Updated on: Sep 18, 2026 | 10:29 PM

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అందాల భామ.. వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతోంది. తాజాగా ‘ది వ్యాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. 

1 / 5
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అందాల భామ.. వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతోంది. తాజాగా ‘ది వ్యాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమన్నా చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2 / 5
ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో తన కో-స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రా గురించి మాట్లాడుతూ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పనిచేశానని చెప్పిన తమన్నా.. సిద్ధార్థ్ లాంటి అందమైన నటుడిని మాత్రం ఇంతవరకు చూడలేదని ప్రశంసించారు. ‘హ్యాండ్‌సమ్’ అనే పదానికి సిద్ధార్థ్ మల్హోత్రానే నిలువెత్తు రూపం అన్నట్టుగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

3 / 5
ఇక సినిమాలో తమన్నా, సిద్ధార్థ్ మధ్య కనిపించనున్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ‘ది వ్యాన్’ సినిమాలో బిహారీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఛఠ్ పూజ నేపథ్యంలో ఓ ప్రత్యేకమైన పాటను చిత్రీకరించారు. ఈ పాట గురించి మాట్లాడుతున్న సమయంలో తమన్నా తన వ్యక్తిగత అనుభవాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

4 / 5
ముంబయిలో పుట్టి పెరిగిన తనకు జుహూ బీచ్‌లో వేలాది మంది మహిళలు ఛఠ్ పూజ నిర్వహించడం చాలాసార్లు కనిపించేదని ఆమె తెలిపారు. అయితే ఈ పూజ వెనుక ఉన్న సంప్రదాయం, భక్తి, కఠినమైన ఆచారాల గురించి సినిమా షూటింగ్ సమయంలోనే మరింత లోతుగా తెలుసుకున్నానని వెల్లడించారు. ఛఠ్ పూజలో మహిళలు పాటించే కఠినమైన నియమాల గురించి కూడా తమన్నా ప్రస్తావించారు. దాదాపు 36 గంటల పాటు నీళ్లు కూడా తీసుకోకుండా ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొంటారని ఆమె తెలిపారు.

5 / 5
బిహారీ సంస్కృతిలో ఛఠ్ పూజకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందని, సాధారణంగా మనం ఉదయించే సూర్యుడికి పూజలు చేస్తామని.. అయితే ఛఠ్ పూజలో అస్తమించే సూర్యుడికి కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వడం తనను ఎంతగానో ఆకట్టుకుందని తమన్నా పేర్కొన్నారు. ఛఠ్ పూజ పాట షూటింగ్ సమయంలో తనకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగిందని తమన్నా చెప్పారు. షూటింగ్ సమయంలో తనలో ఏదో తెలియని అతీతమైన శక్తి ప్రవేశించినట్టుగా, ఒక దివ్యమైన భావోద్వేగాన్ని అనుభవించానని తమన్నా చెప్పుకొచ్చారు. 

Loading...
Unable to load recommendations.
Follow Us