
పై ఫొటోలో కనిపిస్తోన్న స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? చేతిలో ఉన్న బోర్డు చూస్తుంటే హైదరాబాదీ అమ్మాయే అనిపిస్తోంది కదా.. అవును ఈ బ్యూటీ పక్కా తెలుగమ్మాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోంది. కేవలం యాక్టింగ్ ఒక్కటే కాదు డ్యాన్స్ లోనూ ఇరగ దీస్తోందీ అందాల తార.

ఈ బ్యూటీ డ్యాన్సింగ్ స్కిల్స్ చూసి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ వచ్చిందట. అయితే వివిధ కారణాలతో ఆ ఛాన్స్ ను మిస్ చేసుకుంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవే స్వయంగా ఈ విషయాన్ని బయట పెట్టారు. దీంతో ఈ అమ్మడి పేరు తెగ మార్మోగిపోయింది.

ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో! యస్.. ఇందులో ఉన్నది మరెవరో కాదు హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. సందీప్ కిషన్ తో కలిసి ఆమె నటించిన సిగ్మా సినిమా ఇవాళ (అక్టోబర్ 02) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో చిట్టీకి సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

కాగా హైదరాబాద్‌లోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది ఫరియా. విద్యాభ్యాసమంతా ఇక్కడే పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని లయోలా అకాడమీ డిగ్రీ పీజీలో గ్రాడ్యుయేషన్ వేడుకల్లో ఫరియాను చూసిన కల్కి డైరెక్టర్ జాతి రత్నాలు సినిమాలో ఆమెను కథానాయికగా ఎంపిక చేశాడు.

జాతి రత్నాలు హిట్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగర్రాజు, లైక్ షేర్ సబ్ స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు, కల్కి 2898 ఏడీ, మత్తు వదలరా 2, గుర్రం పాపి రెడ్డి, అనగనగా ఒక రాజు, గాయపడ్డ సింహం తదితర సినిమాల్లో నటించింది ఫరియా.

ఇప్పుడు సిగ్మా అనే మరో కొత్త సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చిందీ అందాల తార. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మనీ హీస్ట్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించాడు.