
టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్దాదాస్. ఈ అందాల భామ గురించి తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు 20 ఏళ్లుగా సినీరంగంలో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటివరకు సరైన బ్రేక్ అందుకోలేదు. అప్పుడప్పుడు అవకాశాలు వస్తున్నప్పటికీ సరైన స్టార్ డమ్ కోసం ఇంకా ఎదురుచూస్తుంది ఈ బ్యూటీ.

40 ఏళ్లకు చేరువలో ఉన్న ఈ వయ్యారి.. చెక్కు చెదరని గ్లామర్ సొగసులతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతున్నారు. నెట్టింట ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఓ వైపు చీరకట్టులో కట్టిపడేస్తూనే మరో వైపు మోడ్రన్ డ్రస్సుల్లో మతిపోగొడుతోంది.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాళీ భాషలలో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు కావొస్తున్నా ఇప్పటివరకూ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ రాలేదు.

అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన అనుకున్నంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది శ్రద్దాదాస్. ప్రస్తుతం ఈ బ్యూటీ అడపాదడపా సినిమల్లో మెరుస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో అందాలతో ఆకట్టుకుంటుంది.

తన గ్లామర్ తో దర్శకనిర్మాత దృష్టిని ఆకర్షిస్తుంది శ్రద్దాదాస్. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫోటోలకు యమా డిమాండ్ ఉంటుంది. నెటిజన్స్ ఈ బ్యూటీ పిక్స్ కు తెగ లైకులు కామెంట్స్ చేస్తున్నారు.