
ఆమె ఓ అందాల తార.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా వ్యాప్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బీ గ్రేడ్ సినిమాలో నటించి విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఆమె.. అప్పట్లో స్టార్ హీరోలకు సమానంగా ఆమెకు ఫ్యాన్ బేస్ ఉండేది. తెలుగుతో పాటు తమిళ్ బాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది..ఇక ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు ఆమె ఎవరో తెలుసా.?

ఆమె ఎవరో కాదు బోల్డ్ సినిమాలతో పాపులర్ అయిన షకీల. సినిమాలతోనే కాదు తెలుగు బిగ్ బాస్ షో లో పాల్గొన్నారు ఆమె. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో షకీలా పాల్గొన్నారు. కొన్నివారాలకే ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. కాగా గతంలో షకీలా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షకీలా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఆమె తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు.

ఆమె నటించిన సినిమాలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దూసుకుపోయేవి ఆమె సినిమాలు. విపారీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఏకైక శృంగార తారగా నిలిచారు. ఓ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ.. తాను ఏడూ ఎనిమిది మందితో ప్రేమాయణం సాగించాను అని తెలిపారు షకీల. కానీ వారు తనను పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేరని పైగా తన ఆస్థిని దోచేశారు తెలిపారు.. అలాగే ఆమె మాట్లాడుతూ.. నేను బీ గ్రేడ్ సినిమాలు చేసి సంపాదించిందంతా నా కుటుంబం కోసమే అన్నారు..

అప్పుడు నేను ఎవరికోసమైతే అంతగా కష్టపడ్డానో.. అంత సంపాదించానో.. వాళ్లు ఇప్పుడు నాతో లేరు. కేవలం డబ్బులు ఉంటేనే మనతో ఉంటారు. కానీ ఇప్పుడు నేను తినడానికి లేని పరిస్థితిలో లేను.. కానీ నాకంటూ ఎవ్వరూ లేరు అని అన్నారు షకీలా. అలాగే పెళ్లి గురించి మాట్లాడుతూ.. పెళ్లి అనేది మన చేతిలో ఉండదు అన్నారు. అలాగే నేను 23 ఏళ్లకే అన్ని చూసేశా.. చిన్న వయసులోనే బాగా సంపాదించా.. 5 కార్లు , కొన్ని ఇళ్లు కొన్నాను. అందరిలానే నాకు అనిపిస్తుంది.. నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉండాలి.. పిల్లలు ఉండాలి. అమ్మ అని పిలిచే వాళ్లు ఉండాలి అని ఎమోషనల్ అయ్యారు షకీలా.

అలాగే చాలా మందిని ప్రేమించాను కానీ వాళ్లు మోసం చేశారు. మా అమ్మ నాతో ఉండకూడదు అని కండీషన్ పెట్టారు. ఇక నేను ఇప్పుడు కొంతమంది ట్రాన్స్ జెండర్స్ ను దత్తత తీసుకున్నా అలా పెళ్లి కాకుండానే తల్లిని అయ్యాను వాళ్లకు పెళ్లిళ్లు చేస్తున్నా అని అన్నారు షకీల. ప్రస్తుతం షకీలా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె చెన్నైలో ఉంటున్నారని తెలుస్తుంది.