Cinema : రూ.130 కోట్లతో తీస్తే వచ్చింది రూ.5 కోట్లే.. ఇండస్ట్రీ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌.. దెబ్బకు మైండ్ బ్లాక్..

Updated on: Oct 24, 2026 | 5:32 PM

ఇద్దరూ స్టార్ హీరోస్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్. దీంతో ఆ ప్రాజెక్ట్ పై ముందు నుంచి భారీ హైప్ నెలకొంది. దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఆ సినిమా చివరకు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాదు ఈ మూవీ కనీసం 10 శాతం కూడా రిటర్న్ తీసుకురాలేకపోయింది. ఇంతకీ మనం ఏం మాట్లాడుకుంటున్న సినిమా పేరేంటీ.. ? అందులో నటించిన ఆ ఇద్దరు హీరోలు ఎవరు ? అనే విషయాలు తెలుసుకుందామా.

1 / 5
బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు తిరుగులేని విజయాలతో బాక్సాఫీస్‌ను శాసించిన స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan). ఒకప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. అయితే ఇటీవల కాలంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారీ అంచనాల మధ్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'హైవాన్' బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది.

2 / 5
ఏకంగా రూ. 130 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, కనీసం పెట్టిన పెట్టుబడిలో పది శాతం కూడా రాబట్టలేక బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత పెద్ద డిజాస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచే అక్షయ్ కుమార్ , సైఫ్ అలీ ఖాన్ కలిసి నటిస్తుండటంతో ప్రేక్షకులలో,ట్రేడ్ వర్గాలలో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ప్రచార చిత్రాలు, టీజర్లు సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. కానీ, సినిమా థియేటర్లలో విడుదలైన మొదటి రోజే డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకుంది.

3 / 5
మొదటి ఆట నుంచే ప్రేక్షకులు సినిమాను తిరస్కరించడంతో థియేటర్లు వెలవెలబోయాయి. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుందనుకున్న ఈ సినిమా, కేవలం రూ. 5 కోట్ల లోపే కలెక్షన్లను సాధించి కోలుకోలేని దెబ్బతింది. రూ. 130 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి ఈ స్థాయి కలెక్షన్లు రావడం బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. నిర్మాతలకు ఇది అతిపెద్ద నష్టాన్ని మిగిల్చడమే కాకుండా, హీరోల కెరీర్‌లోనే అత్యంత దారుణమైన పరాజయంగా రికార్డులకెక్కింది.

4 / 5
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయిలో చల్లాచెదురు కావడానికి బలమైన కారణాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా కథాంశం రొటీన్‌గా ఉండటం, ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్క్రీన్‌ప్లే లేకపోవడం ప్రధాన లోపాలుగా మారాయి. ప్రేక్షకుల నాడిని అంచనా వేయడంలో విఫలమవ్వడం, పాత చింతకాయ పచ్చడి లాంటి కథను నేటి ట్రెండ్‌కు తగినట్లుగా మలచలేకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించిందని విమర్శలు వస్తున్నాయి.

5 / 5
ప్రస్తుత ప్రేక్షకులు కేవలం స్టార్ హీరోల పేర్లను చూసి థియేటర్లకు రావడం లేదు, కేవలం బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలకే నీరాజనాలు పడుతున్నారు. ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తూ అక్షయ్ కుమార్ 'హైవాన్' రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో అయినా స్టార్ హీరోలు కథల ఎంపికలో మరింత జాగ్రత్త వహించాలని, లేదంటే బాక్సాఫీస్ వద్ద ఇలాంటి చేదు అనుభవాలు తప్పవని ఈ డిజాస్టర్ మరోసారి హెచ్చరించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us