
అది ఏమిటంటే? రోజా ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ పై తన నటనతో ఓ ఊపు ఊపేసింది. చిరు, బాలయ్య, వెంకటేష్ ఇలా చాలా మంది స్టార్ హీరోలతో జతకట్టింది. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.

అయితే రోజా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పాన్ ఇండియా స్టా్ర్ హీరోను ఎత్తు కొని ఆడించిందంట. అంతే కాకుండా ఆ హీరోతో చాలా సేపు ఆడుకుంటూ ఉండేదంట. ఇంతకీ ఆ హీరో ఎవరనేగా మీ ఆలోచన?

త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా రికార్డ్స్ క్రియేట్ చేసిన రామ్ చరణ్ ను రోజా ఎత్తుకొని ఆడించిందంట. చిరుతో ముఠా మేస్త్రీ సినిమా చేస్తున్న సమయంలో, ఊటీలో షూటింగ్ జరగుతుండగా, చెర్రీ అక్కడికి వచ్చాడంట.

దీంతో షూటింగ్ అయిపోయాక రోజా చరణ్ ను ఆడిస్తూ.. తనతో చాలా సేపు టైమ్ స్పెండ్ చేసేదంట. ఈ విషయాన్ని రోజా ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

చరణ్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు, తాను షూటింగ్ వద్దకు వచ్చి చాలా సందడి చేసేవాడు, పట్టుకుందామన్నా దొరకకపోయేది. త్రిబుల్ ఆర్ లో చెర్రీ నటన చూస్తే చాలా గర్వంగా అనిపించింది, చిన్నప్పుడు అల్లరి చేసిన చరణ్ ఇతనేనా అనిపించిందంటూ చెప్పుకొచ్చింది.