
ఒకప్పటి స్టార్ హీరోయిన్గా ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించి, ప్రస్తుతం పవర్ఫుల్ క్యారెక్టర్ రోల్స్‌తో తన హవాను కొనసాగిస్తున్న సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా 'బాహుబలి' సినిమాలో శివగామి పాత్రలో ఆమె నటన భారతీయ సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సందర్భంగా 'బాహుబలి' సినిమాను తాను మొదట రిజెక్ట్ చేశానని, అలాగే తనకు స్పెషల్ సాంగ్స్ చేయడం చాలా ఇష్టమని తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 'బాహుబలి' అవకాశం వచ్చినప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ రమ్యకృష్ణ ఆసక్తికర విషయాలు చెప్పారు. "ఆ సమయంలో నేను సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి, నిర్మాతగా సీరియల్స్ చేస్తూ ఫుల్ వర్క్ స్ట్రెస్‌లో ఉన్నాను. మా అబ్బాయికి అప్పుడు ఆరేళ్లని అన్నారు.

అలాంటి బిజీ సమయంలో నిర్మాత శోభు యార్లగడ్డ గారు కాల్ చేసి 40 రోజుల డేట్స్ కావాలని అడిగారు. అంత సమయం అడ్జస్ట్ చేయడం కష్టమని నేను వెంటనే నో చెప్పి ఫోన్ పెట్టేశాను. కానీ అది భారీ బడ్జెట్ సినిమా అని నాన్నగారు చెప్పడంతో పాటు, శోభు గారు మళ్లీ కాల్ చేసి ఒక్కసారి కథ వినమని కోరారు. ఆ తర్వాత రాజమౌళి గారు నేరేషన్ ఇచ్చాక నాకు పాత్ర బాగా నచ్చింది. మొదట హీరోయిన్ నుంచి మదర్ రోల్ చేయాలా అని కాస్త ఆలోచించినా, కథ నచ్చడంతో ఒప్పుకున్నాను అని రమ్యకృష్ణ వివరించారు.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తాను చేసిన స్పెషల్ సాంగ్స్ గురించి రమ్యకృష్ణ మాట్లాడుతూ.. హీరోయిన్గా ఉన్నప్పుడే పాత్రల్లో అలాంటి మొనాటని ఉండకూడదని, నాకు డ్యాన్స్ అంటే ఉన్న ఇష్టంతో స్పెషల్ సాంగ్స్ చేశాను. బాహుబలి సక్సెస్ పార్టీలో రాజమౌళి గారు నెక్స్ట్ ఎలాంటి పాత్ర చేయాలనుకుంటున్నారు అని అడిగితే, వెంటనే స్పెషల్ సాంగ్ చేయాలని చెప్పానని అన్నారు. దాంతో ఆయన షాక్ అయ్యారని గుర్తు చేసుకున్నారు.

నిజానికి రాజమౌళితో నేను మొదటిసారి పనిచేసింది 'సింహాద్రి' సినిమాలోని 'చిన్నదమ్మి చీకులు కావాలా..' అనే స్పెషల్ సాంగ్ కోసమే. ఆ పాట షూటింగ్ నా పెళ్లికి ముందు రోజు రాత్రి జరిగింది. రాజమౌళి ఎంతసేపటికీ షూట్ ముగియకపోవడంతో.. 'రేపు నా పెళ్లి ఉంది, మీరు వదలకపోతే నా పెళ్లి జరగదు అని చెప్పి మరీ వెళ్లాను అంటూ ఆనాటి సరదా జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.