Basha Shek |
Jun 23, 2023 | 10:08 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
అపోలో ఆస్పత్రిలో ఉపాసన ప్రవసం జరగ్గా.. శుక్రవారం ఆమె డిశ్చార్జ్ అయ్యింది. ఈ సందర్భంగా ఉపాసనను, తన కూతురును దగ్గరుండి ఇంటికి తీసుకుపోయాడు రామ్ చరణ్.
కాగా మెగా ప్రిన్సెస్ ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు గూమిగూడారు. ఈ సందర్భంగా తమ బేబీ క్షేమాన్ని కోరుతూ ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు చెర్రీ, ఉపాసన
మీరు చూపిస్తున్న ప్రేమకు నాకు మాటలు రావడం లేదు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అని ఫ్యాన్స్ తో చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.
ఈ సందర్భంగా తమ పాప పేరుపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రామ్ చరణ్. ఏ పేరు పెట్టాలనే విషయమై తానూ ఉపాసన ఒక నిర్ణయానికి వచ్చామన్నాడు.